అస్సలు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగి ఉంటే..ఇప్పుడు ధియేటర్స్ దగ్గర కధ వేరేలా ఉండేది. కానీ ఏం చేద్దాం మాయదారి కరోనా మన ఆశలపై నీళ్లు చల్లింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా తో మెగా నందమూరి అభిమానులు..రాధే శ్యాం మూవీ వాయిదాతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
ఇక మరీ ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా పడటం చాలా మంది స్టార్ సెలబ్రిటీలను కూడా బాధపెట్టింది. ఇ విషయాని వాళ్లే స్వయంగా పలు వేదికలు పై చెప్పుకొచ్చారు. గత రెండు సంవత్సరాల నుంచి ఎప్పుడు థియేటర్ల లోకి వస్తుందా ? అని కోట్లాది మంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత తెరకెక్కింది త్రిబుల్ ఆర్ మూవీ.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి విడుదల చేయాలి అని భావించారు. దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరగడం, థియేటర్ ఆక్యుపెన్సీ, పలు రాష్ట్రాల్లో స్వల్ప లాక్‌డౌన్ వల్ల ఈస్ ఇనిమా విడుదల వాయిదా వేసారు మేకర్స్.
దీంతో తీవ్ర నిరాశకు గురైయ్యారు అభిమానులు. అగ్ర నిర్మాత డివివి దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారన్న విషయం తెలిసిందే. ఇక కేవలం సినిమా ప్రమోషన్స్ కే 52 కోట్లు ఖరుచ్ చేసారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇలాంటి టైంలో సినిమా వాయిదా పడటం రాజమౌళికి .. టీం కి భారి దెబ్బ నే అని మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి అనే క్రమంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ షాకింగ్ కామెంట్స్ చేసారు.
తాజాగా ‘రౌడీ బాయ్స్’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఈయన సినిమా గురించి మాట్లాడుతూ..”మా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. కానీ కాలేదు. అయినా మాకు ఏం బాధలేదు. ఎందుకంటే అలాంటి చిత్రం సరైన సమయంలో వస్తేనే బాగుంటుంది.
మేము ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మూడున్నర సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. ఇక మా సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయించి మీకు చెప్తారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో తెలీదు కానీ.. దిల్ రాజు గారికి మాత్రం చాలా ముఖ్యం అంటూ సెటైర్స్ వేసారు. సంక్రాంతి మమ్మల్ని వదులుకోడానికైనా రెడీగా వుంది కానీ దిల్ రాజుని వదులుకోడానికి మాత్రం రెడీగా లేదు అంటూ నవ్వులు పూయించాడు”..రామ్ చరణ్ .