తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ నటి నదియా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరుగా ఉన్నారు. 1980వ దశకంలో తెలుగుతో పాటు తమిళ్‌లో పలు సినిమాల్లో నటించిన ఆమె అప్పట్లో తన అంద చందాలతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. మహేష్‌బాబు అన్న రమేష్‌బాబు పక్కన బజార్‌రౌడీతో పాటు సురేష్ లాంటి సీనియర్ హీరోల పక్కన నటించింది. స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సులు ఉన్నా కాలం కలిసి రాకపోవడంతో తక్కువ సినిమాలే చేసింది. ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నదియా ఆ తర్వాత సెకండ్ ఇన్సింగ్స్‌ను మాత్రం చాలా గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది. ముందుగా తమిళ్‌లో విశాల్ భరణి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నదియా ఆ తర్వాత ప్రభాస్ మిర్చి, పవన్ అత్తారింటికి దారేది సినిమాలతో ఒక్కసారిగా పవన్‌కు అత్తగా చేసిన క్యారెక్టర్ ఆమె అత్త అన్న పాపులర్ పదాన్ని ఆమె సొంతం అయ్యేలా చేసింది. ఆ సినిమా తర్వాత నదియా డిమాండ్ మామూలుగా లేదు.
ఆమె 1984 – 90లో తెలుగు, తమిళ్, మళయాళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పుడు మెగాస్టార్‌తో ఛాన్స్ వచ్చిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 1990లో చిరు కౌబాయ్ పాత్రలో కొదమసింహం సినిమా చేశారు. రు. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఈ పాత్రలకు నదియా, రాధా, వాణీ విశ్వనాథ్‌ను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే మెయిన్ హీరోయిన్‌గా నదియాను అనుకున్నారట.
అప్పటికే ఆమె వివాహం చేసుకోవడంతో చిరు సినిమాలకు ఆమె డేట్లు ఎడ్జెస్ట్ చేయలేకపోయిందట. నదియా స్థానంలో బాలీవుడ్ నటి సోనమ్‌ను తీసుకున్నారు. మెయిన్ హీరోయిన్‌గా రాధనే ఎంచుకున్నారు. కొదమసింహం అప్పట్లో కౌబాయ్ స్టోరీతో రావడంతో జనాలకు బాగా ఎక్కింది. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలా నదియా చిరుతో నటించే ఛాన్స్ మిస్ అయ్యారు.