నాగార్జున అనవసరంగా బంగార్రాజు సినిమా ఫంక్షన్‌లో టిక్కెట్ రేట్లపై స్పందించను.. తాను రాజకీయాల గురించి మాట్లాడను అన్నందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌కు బలైపోవాల్సి వచ్చింది. నాగార్జున అన్న మాటలే తప్పేం లేదు. తాను సినిమా వేదికపై రాజకీయాలను మాట్లాడను అన్నారు.. అది ఆయన ఇష్టం. లేనిపోని కాంట్రవర్సీలు నాకెందుకు అని ఆయన అనుకున్నాడు. అయితే దీనిని పట్టుకుని ట్విట్టర్ మార్మోగింది. కొందరు పవన్‌ను ట్రోల్ చేస్తే.. పవన్ ఫ్యాన్స్ దానికి కౌంటర్‌గా నాగార్జునను ట్రోల్ చేశారు.
తాను రాజకీయాలు మాట్లాడను అన్న మాటను కొందరు నెటిజన్లు పవన్‌కు ట్యాగ్ చేశారు. దీంతో పవన్ అభిమానులకు కోపం వచ్చింది. నాగార్జున స్టేట్‌మెంట్‌ను పట్టుకుని ఆయన్నే ట్రోల్ చేశారు. నాగార్జున ఎక్కడా పవనో, వర్మో, నానియో లేదా మరో పేరో చెప్పలేదు. అయితే పవన్ అభిమానులు మాత్రం నాగార్జునను ఓ ఆటాడుకున్నారు. నాగ్ ఏపీ ప్రభుత్వానికి భయపడే సినిమా రేట్ల గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదని సెటైర్లు వేశారు.
ఇక నాగార్జున టిక్కెట్ రేట్లు తగ్గించినా కూడా తనకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్పడంతో ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయారా ? లేదా పెద్ద సినిమాల సంగతి తనకు అనవసరం అని చెప్పారా ? అన్న చర్చలు కూడా నెటిజన్ల మధ్య నడిచాయి. మధ్యలో కొందరు నెటిజన్లు పవన్ పేరు తీసుకు రావడంతో అది పవన్ ఫ్యాన్స్‌కు ఎక్కడో టచ్ అయ్యింది. దీంతో వారు నాగార్జునపై పడ్డారు.
ఇక నాగార్జునను ఏకేస్తున్నారు. నాగ్ ఈ విషయంలో ముందు నుంచి సైలెంట్‌గానే ఉన్నారు. గతంలో రుద్రమదేవి సినిమా ఫంక్షన్‌లో చెప్పను బ్రదర్ అన్నందుకు బన్నీ పవన్ ఫ్యాన్స్‌కు టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు నాగ్ ఏమీ అనకుండానే ట్రోల్‌కు బలయ్యాడు.