Moviesప‌ద్ధ‌తిగా ఉండే ప‌వ‌న్ హీరోయిన్ ఇలా తెగించేసిందేంటి..!

ప‌ద్ధ‌తిగా ఉండే ప‌వ‌న్ హీరోయిన్ ఇలా తెగించేసిందేంటి..!

అమ్మాయి బాగుంది సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన మీరా జాస్మిన్‌ను ఆ సినిమా త‌ర్వాత ప్రేక్ష‌కులు ఎవ్వ‌రూ గుర్తు పెట్టుకోలేదు. ఆ త‌ర్వాత రెండో సినిమాతోనే ఆమె ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుడుంబా శంక‌ర్ సినిమాలో హీరోయిన్ అయిపోయింది. ప‌వ‌న్ ప‌క్క‌నే రెండో సినిమాలో ఛాన్స్ అంటే మామూలు ల‌క్ కాదు. ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే మీరా జాస్మిన్ రేంజ్ మారిపోయి ఉండేది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో మీరా జాస్మిన్ ఆ త‌ర్వాత అంత స్పీడ్‌గా మూవ్ అవ్వ‌లేదు.

అయినా కూడా బాల‌కృష్ణ‌, ర‌వితేజ సినిమాల్లో ఆమెకు అవ‌కాశాలు వ‌చ్చాయి. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా వ‌చ్చిన హిట్ సినిమా భ‌ద్ర సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టించింది. ఇక బాల‌య్య ప‌క్క‌న మ‌హార‌థి సినిమా చేసింది. ముందు స్లిమ్‌గా ఉండే మీరా ఆ త‌ర్వాత బాగా లావైపోయింది. మ‌రీ బొద్దుగా మారిపోయింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఆమె చేసిన సినిమాలలో చీర‌క‌ట్టుతో పాటు సంప్ర‌దాయ బ‌ద్ధంగా ఉండేది.

ఆ త‌ర్వాత ఆమె సేఫ్ మారిపోవ‌డంతో ఆమెకు ఛాన్సులు రాలేదు. ఆ త‌ర్వాత మీరా జాస్మిన్ స్థానాన్ని నిత్య‌మీన‌న్ లాంటి వాళ్లు భ‌ర్తీ చేశారు. ఇప్పుడు మీరాను మ‌ర్చిపోయారు. కుటుంబ ప‌ర‌మైన వివాదాల‌తో కూడా ఆమె వార్త‌ల్లోకి ఎక్కింది. అయితే ఇప్పుడు మీరాను అంద‌రూ మ‌ర్చిపోయారు అనుకుంటోన్న టైంలో ఆమె మ‌ళ్లీ ద‌ర్శ‌నమిచ్చింది.

సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మీరా కొత్త లుక్ వైర‌ల్ అవుతోంది. అయితే ఈ సారి మీరా ప‌ద్ధ‌తి మార్చేసింది. చాలా నాజుగ్గా త‌యార‌వ్వ‌డంతో పాటు గ్లామ‌ర‌స్ లుక్‌లో, హాట్ ఫొజుల‌తో క‌వ్విస్తోంది. ఈ లుక్‌లో మీరాను చూస్తుంటే అస‌లు ఆమె మీరాయేనా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. మీరాలో ఈ స‌డెన్ మార్పు ఏంటో అని అంద‌రూ షాక్ అవుతున్నారు. మ‌రీ ఈ హాట్ లుక్‌తో అయినా మీరాకు సెకండ్ ఇన్సింగ్స్‌లో ఛాన్సులు వ‌స్తాయేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news