టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఐదు వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎప్పుడూ ఐదు వరుస హిట్లు రాలేదు. ఇప్పుడు ట్రిఫుల్ ఆర్ కూడా హిట్ అయితే ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ డబుల్ హ్యాట్రిక్ వచ్చినట్లవుతుంది. టాలీవుడ్‌లో ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో ఏ హీరోకు కూడా ఇలాంటి అరుదైన రికార్డ్ లేదు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ హిట్ స్టూడెంట్ నెంబర్ వన్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అయ్యాక ఆ తర్వాత ఆది, అల్లరి రాముడు హిట్ అయ్యాయి.
మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్‌ను ఒక్కసారిగా టర్న్ చేసింది. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన హిట్ సినిమాలపై ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు కూడా కన్నేశారు. ఇక్కడ హిట్ సినిమాలను కన్నడ, తమిళ్ భాషల్లో రీమేక్ చేశారు. అయితే అక్కడ అవి ఫట్ అయ్యాయి. కారణం ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించడంతో ప్రేక్షకులకు మైండ్లోకి అలా వెళ్లిపోయాయి.
ఈ కథలు ఇతర భాషల్లో రీమేక్ చేసినప్పుడు ఆ హీరోలు ఎన్టీఆర్ రేంజ్ నటన చూపకపోవడం, దర్శకత్వ లోపాల వల్ల అక్కడ భారీ డిజాస్టర్లు అయ్యాయి. అలా మూడు సినిమాలు ఇక్కడ హిట్ అయితే తమిళ్‌లో ఫట్ అయ్యాయి. అవేంటో చూద్దాం.
స్టూడెంట్ నెంబర్ వన్ :
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ ఎన్టీఆర్ కెరీర్‌ను టర్న్ చేసింది. తొలి సినిమాతోనే ఎన్టీఆర్‌కు యూత్‌లో మాంచి క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాను తమిళ్‌లో శిబిరాజ్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అట్టర్‌ప్లాప్ అయ్యింది. తమిళ డైరెక్టర్ సెల్వ ఈ సినిమాను ఏ మాత్రం సరిగా ప్రజెంట్ చేయలేదు.
ఆది:
వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చి 2002లో సూపర్ డూపర్ హిట్ అయిన ఆది సినిమా అప్పట్లోనే 98 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఈ సినిమాను తమిళ్‌లో ప్రశాంత్ హీరోగా నారాయన్ రీమేక్ చేశారు. ఆది అంచనాలతో అక్కడ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే డిజాస్టర్ అయ్యింది.
సింహాద్రి :
ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. తమిళ్‌లో విజయ్‌కాంత్ హీరోగా నటించగా గజేంద్ర అనే టైటిల్‌తో ఈ సినిమా వచ్చింది. సీనియర్ దర్శకుడు సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.