టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగచైతనయ సమంత విడాకులు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. ఏమాయ చేసావే సినిమా షూటింగ్ టైంలోనే ప్రేమలో పడ్డ ఈ జంట ఆ తరువాత కొన్నాళ్లు ప్రేమించుకును..గుటూచప్పుడు కాకుండా లవ లో మునిగితేలి..ఫైనల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళను ఒప్పించి..ఎట్టకేలకు గ్రాండ్ గా గోవాలో వెడ్డింగ్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అబ్బో అప్పట్లో ఏ చానెల్ లో చూసిన వీళ్ల పెళ్ళి మ్యాటర్ హైలెట్ గా నిలిచింది. ఆ పాటలు, ఆ డ్యాన్సులు..అదో పండగల చేసుకున్నారు.
ఇక పెళ్లి తరువాత హనీ మూన్ లు..తదితర కార్యక్రమాలు కూడా బాగానే ఎంజాయ్ చేసారు. వాళ్ళ రొమాంటిక్ ఫోటోలు ..స్టిల్ లు..అబ్బో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక దీంతో ఈ జంట కు తిరుగు లేదు..100 సంవత్స్రాలు అన్యోన్యంగా కలిసి ఉంటారు..సితా రాలులు,శివ పార్వతులు అంటూ పొగిడేశారు. తీరా ఫైనల్ గా సీన్ కట్ చేస్తే వన్ ఫైన్ డే..మేం విడాకులు తీసుకోబోతున్నాం. విడాకులు తీసుకున్నా మేము మంచి ఫ్రెండ్స్ గానే ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు ఈ జంట.
ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ జంత పై వస్తున్న వార్తలు అనీ ఇన్నీ కావు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైన ఉంది అంటే అది నాగచైతన్య సమంత విడాకుల మ్యాటర్ నే. వీళ్ళు విడాకులు తీసుకునేందుకు ఎంత బాధపడుతున్నారో తెలియదు కానీ ఈ జంట విడిపోతున్నందుకు వాళ్ల అభిమానులు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. విడాకులు తీసుకుంటున్నం అని అనౌన్స్ చేసి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంకా కూడా చైతన్య-సమంత కలిపోతే బాగుండూ అని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
అయితే అది జరిగే పని కాదు అని తెలిసిపోయింది. ఇప్పటికే విడాకుల పై నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని హ్యాపీ గా ఉంటున్నం అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఈ మధ్యనే కొడుకు కోడలు డివర్స్ పై స్పందించిన నాగ్..రీసెంట్ గా మరోసారి సమచలన మ్యాటర్ లీక్ చేసారు. ఈ దెబ్బతో అభిమానులకు తప్పు ఎవరిదో అర్ధమైపోయేలా చెప్పాడు.
విడాకుల గురించి స్పందిఅతూ.. చైతూ నుంచి సమంతే మొదటగా విడాకులు కోరిందని ఆ తరువాత ఆమె నిర్ణయాన్ని గౌరవించి చై విడాకులకు అంగీకరించాడని తెలిపాడు. నిజానికి చైసామ్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారన్న నాగ్.. నాలుగేళ్ల వివాహబంధంలో విడిపోయేటంత పెద్ద సమస్యేంటో తనకు ఇప్పటికీ తెలియదని పేర్కొన్నాడు. కానీ విడాకులు ప్రకటన తరువాత చై అక్కినేని కుటుంబం పరువు పోతుందని..నేను బాధపడతానని చాలా ఆలోచించాడు అంటూ కొడుకుని సపోర్ట్ చేస్తూనే సమంత పై మొత్తం మ్యాటర్ తోసేశారు. మరి చూడాలి సమంత దీని పై ఎలా స్పందిస్తుందో..?