Moviesవారెవ్వా..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయ మూవీ శ్యామ్ సింగ...

వారెవ్వా..ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క భారతీయ మూవీ శ్యామ్ సింగ రాయ్..ఇది అసలైన రికార్డ్ అంటే..!

గత కొంత కాలంగా సక్సెస్ లేని నానికి శ్యామ్ సింగ రాయ్ మూవీ భారీ హిట్ ఇచ్చింది. నాని ఈ ఏడాది నటించిన వి – ట‌క్ జగదీష్ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఇక నాని పనైపోయింది అని అందరు అనుకుంటున్న తరుణంలో శ్యామ్ సింగ రాయ్ రూపంలో నానికి తిరుగేని విజయం అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా కృతి శెట్టి – సాయిపల్లవి – మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా శ్యామ్‌సింగరాయ్‌. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పునర్జన్మల కాన్సెప్టుతో వచ్చింది.

అయితే శ్యాం సింగ‌రాయ్ సినిమా మాత్రం తొలిరోజు నుంచే అదిరిపోయే హిట్ టాక్ తెచ్చుకుంది. శ్యామ్‌ సింగరాయ్‌గా నాని నటన… దేవదాసు పాత్రలో సాయి పల్లవి అద్భుతమైన పెర్ఫార్మెన్స్, రాహుల్ డైరెక్షన్, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు సినిమాకి అన్ని పాజిటివ్ కామెంట్స్ నే వచ్చాయి.

ఈ సినిమాలో మరి ముఖ్యంగా నాని సాయి పల్లవి..లవ్ సీన్స్ బాగా పండాయి. తెర పై వీళ్ళ జంటకు ఇది వరకే మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ జంట పై బోలెడు అంచనాలు పెట్టుకున్న అభిమానుల ఎక్స్ పెక్టేషన్స్ ని ఏమాతర్మ్..తగ్గకుండా ఆ స్దాయిలోనే సినిమాను తెరకెకించాదు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ . థియేటర్లలోనే కాకుండా ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పిస్తోందీ చిత్రం. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి అలరించారు. ఈ సినిమా జనవరి 21 నుంచి నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమింగ్ అయిన మొదటి మూడు రోజుల్లోనే దాదాపుగా 3.6 లక్షల వ్యూస్ ను దక్కించుకుంది. ఈ సినిమా నె‌ట్‌ఫ్లిక్స్‌లో గత వారం రోజులుగా ఎక్కువ మంది వీక్షించిన భారతీయ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. జనవరి 17 నుంచి 23 మధ్య శ్యామ్ సింగ రాయ్ సినిమాకు ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్ వచ్చాయి. అలాగే ట్రెండింగ్ విషయానికొస్తే నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ మూవీ మూడవ స్థానంలో నిలిచింది. ఆ వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో టాప్ 10 లో ఒకే ఒక్క ఇండియన్ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఏ ఒక్క సౌత్ ఇండియన్ మూవీకి దక్కని అరుదైన రికార్డును శ్యామ్ సింగ రాయ్ దక్కించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news