అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇప్పటకీ ట్రెండింగ్‌లోనే ఉంటోంది. వీరిద్దరు విడాకులు తీసుకుని ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు. ఎవరికి వారు ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు. అయితే వీరిద్దరి గురించి గాసిప్‌లు మాత్రం ఆగలేదు. అయితే వీరిద్దరు విడిపోవడం ఇద్దరి అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. ఎంతో అన్యోన్యంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని నాలుగేళ్ల పాటు కలిసి కాపురం చేసుకున్న ఈ జంట విడిపోవడం చాలా మందిని బాధించింది.
ఇక వీరు విడాకులు తీసుకున్నాక సమంత మాత్రమే అప్పుడప్పుడు పరోక్షంగా ఏదోలా సైటైర్ల రూపంలో కామెంట్లు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్ పెడుతూ వచ్చిందే తప్పా చైతు మాత్రం ఎక్కడా నోరు మెదపలేదు. అయితే ప్రస్తుతం చైతు కూడా విడాకులపై నోరు విప్పారు. ప్రస్తుతం నాగార్జున – నాగ చైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది.
జనవరి 14న రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న నాగచైతన్యను ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు చైతు చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చారు. అది మా ఇద్దరి మంచి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని చెప్పారు. ఆమె సంతోషంగా ఉంది.. తాను కూడా సంతోషంగా ఉన్నానని.. పరిస్థితులకు తగ్గట్టుగా ఇది మా ఇద్దరికి బెస్ట్ డెసిషన్ అని చెప్పుకువచ్చాడు.
ప్రస్తుతం చైతు ఇచ్చిన ఆన్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతు ఇచ్చిన ఆన్సర్‌ను బట్టి చూస్తే విడాకుల తర్వాత చైతు ఎలాంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక లవ్‌స్టోరీ హిట్‌తో జోష్‌లో ఉన్న చైతు బంగార్రాజు కూడా హిట్ అయితే మార్కెట్‌ను మరింత పెంచుకుంటాడు.