ఉపాసన కామినేనిగా ఎన్నో అవార్డులు ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె..ఉపాసన కొణిదేల గా మారిన తరువాత ఆ పేరు కి మమ్రింత గౌర్వం వచ్చేలా నడుచుకుంటూ వస్తుంది. ఫస్ట్ నుండి ఉపాసన గురించి మనకు తెలిసిందే ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడేస్తుంది. తనకు అనిపించింది ఫేస్ మీదనే చెప్పడ చిన్నప్పటి నుండి ఉపాసన కి అలవాటు. చరణ్ అలా కాదు అలా చెప్పితే బాధ పడతారు ఏమో అనే స్వభావం కలవాడు. మరి వీళ్ల ఇద్దరికి జంట ఎలా కురిదింది అంటే..దానే ప్రేమ అంటారు.
ఇద్దరు భిన్న అభిప్రాయల కలవారు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఆ జంట అచ్చం చరణ్-ఉపాసన లానే ఉంటారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమించి..ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2012 జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పట్లో దేశమంతా మాట్లాడుకునేంత ఘనంగా ఈ పెళ్లి జరిపించారు ఇరు కుటుంబ సభ్యులు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ ఆదర్శ దంపతులలో ఒకరుగా ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.
అయితే ఉపాసన పై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేదే జరగలేదు. అలానే పద్ధతిగా నడుచుకుంటూ వస్తుంది. కానీ మొదటి సారి ఉపాసన పెట్టిన పోస్ట్ అభిమానులకు కూడా నచ్చలేదట. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని షేర్ చేసింది ఉపాసన. అంత వరకు బాగానే ఉన్నా ఆ తరువాత మ్యాటర్ నే అభిమానులకు కోపం వచ్చింది. ఆమె దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు.
ఆ ఫోటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారని, ఎక్కడో కనిపెట్టండి అంటూ ఉపాసన ఫాలోవర్స్‌ని కోరారు. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. నెటిజన్ల నుంచే కాదు మెగా ఫ్యాన్స్ కూడా ఉపాసన పై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. మీరు ఇటువంటి ఫొటోస్ పెట్టి మీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు.
https://www.facebook.com/photo.php?fbid=486063239542062&set=a.204792221002500&type=3