బాలీవుడ్ హాట్ బ్యూటీ అనడం కంటే మలైకా ఆరోరాను బాలీవుడ్ హాట్ ఆంటీ అనాలేమో…! ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లు కుళ్లుకునేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ తనకంటే వయస్సులో 12 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్‌ను బుట్టలో వేసుకుని డేటింగ్ చేస్తుందంటే ఆమె మామూలు లక్కీ కాదనే చెప్పాలి. ఎప్పుడో బాలీవుడ్లో రెండున్నర దశాబ్దాల క్రితం ఆమె కాస్త పాపులర్ హీరోయిన్. ముఖ్యంగా ఐటెం సాంగ్‌లకు ఆమె పెట్టింది పేరు. షారుక్ ఖాన్ దిల్ సే సినిమాలో చెలి చెయ్యా చెయ్యా సాంగ్‌లో కదులుతున్న రైలుపై ఆమె వేసిన డ్యాన్స్ ఇప్పటకీ ప్రేక్షకులు మర్చిపోలేరు.
ఆ తర్వాత పెళ్లయ్యాక కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ సినిమాలో కెవ్వు కేక ఐటెం సాంగ్‌లో తన ఊపుడు ఊపేసింది. ఇక ఇప్పుడు 47 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ బ్యూటీని సోషల్ మీడియాలో చాలా మంది మమ్మీ అని పిలుస్తూ , ఆటపట్టిస్తూ ఉంటారు. ఆమె తన 25 ఏళ్ల వయస్సులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ఖాన్ను పెళ్లాడిన విషయం తెలిసిందే.
ఇక పెళ్లయ్యి ఒక కొడుకు పుట్టాక… సినిమాల్లో చేస్తోన్న టైంలోనే ఆమె అర్జున్ కపూర్‌కు దగ్గరైంది. అసలు సల్మాన్‌ఖాన్ పట్టుబట్టినా వినకుండా భర్త అర్బాజ్‌ఖాన్‌కు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఫుల్లుగా అర్జున్ కపూర్‌తో డేటింగ్లో మునిగి తేలుతోంది. ఈ జంట గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపించే వారు. అర్జున్ – మలైకా మామూలు ఎంజాయ్ చేయలేదు. అయితే ఇటీవల వీరి మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే మలైకా తాజాగా పెళ్లి గురించి మాట్లాడుతూ.. గతంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి తర్వాత నటించలేదు.. కానీ తనకు నటించడానికి పెళ్లి అనేది అడ్డం కాలేదని చెప్పింది. ఇక ప్రస్తుతం ట్రెండ్ మారిందని.. పెళ్లి తర్వాత కూడా నటించే వారి సంఖ్య ఎక్కువ అవుతోందని చెప్పింది. ఇక ఈ వయస్సులో కూడా హీరోయిన్లకు మించి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తోన్న మలైకా కొడుకు విదేశాల్లో చదువుతున్నాడు.