Moviesచైతు - స‌మంత విడాకుల‌పై నేష‌న‌ల్ మీడియాలో నాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

చైతు – స‌మంత విడాకుల‌పై నేష‌న‌ల్ మీడియాలో నాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

స్టార్ కపుల్ నాగచైతన్య సమంత తాము విడాకులు తీసుకుంటున్న‌ట్టు గ‌తేడాది అక్టోబర్ 2న ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. అంత‌కు రెండు, మూడు నెలల ముందు నుంచే స‌మంత తీరుతో ఆమె చైతుకు దూరం అవుతోందా ? అన్న అనుమానాలు వ‌చ్చాయి. ఆ అనుమానాలు నిజం చేస్తూ వీరిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. వీరిద్ద‌రు విడాకులు తీసుకుని కూడా నాలుగు నెల‌లు అవుతోంది.

అయితే ఈ అంశం ఇప్ప‌ట‌కీ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. అంతెందుకు ఇటీవ‌ల కాలంలో ఎంతో మంది సెల‌బ్రిటీలు విడిపోయారు. ఎవ‌రు విడిపోయినా కూడా ముందుగా చైతు – సామ్ జంట ప్ర‌స్తావ‌నే వ‌స్తోంది. అస‌లు వీరిద్ద‌రు విడిపోవ‌డానికి ఇదే కార‌ణం అంటూ ర‌క‌ర‌కాల పుకార్లు కూడా వ‌స్తున్నాయి. ఇక విడాకుల‌కు ప్ర‌ధానంగా స‌మంత బోల్డ్ క్యారెక్ట‌ర్ల‌లో న‌టించ‌డంతో పాటు ఆమె న‌ట‌న‌పై అక్కినేని ఫ్యామిలీ కండీష‌న్లు పెట్ట‌డ‌మే అన్న ప్ర‌చార‌మే ఎక్కువుగా జ‌రిగింది.

స‌మంత విడాకుల త‌ర్వాత కొన్ని మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛానెల్స్ ఆమెను మ‌రింత గ‌ట్టిగా టార్గెట్ చేశాయి. దీనిపై ఆమె కోర్టును కూడా ఆశ్ర‌యించ‌డం తెలిసిందే. అయితే వీరి విడాకుల‌పై చాలా రోజుల త‌ర్వాత నాగార్జున స్పందించాడు. ప్ర‌స్తుతం బంగార్రాజు స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న నాగార్జున ఓ నేష‌న‌ల్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ చైతు – సామ్ విడిపోయాక సోష‌ల్ మీడియా వేదిక‌గా వారిపై దాడి జ‌రిగింద‌ని… కొంద‌రు కావాల‌నే చెత్త వార్త‌లు ప్ర‌చారం చేశారంటూ వాటిని ఖండించాడు.

గ‌తంలో నాపై ఇలాంటి అస‌త్య వార్త‌లు ఎన్ని రాసినా తాను ప‌ట్టించుకోలేద‌ని.. అయితే ఈ విష‌యంలో కావాల‌నే నెగిటివ్ వార్త‌లు రాయ‌డం త‌న‌ను బాధ పెట్టింద‌ని చెప్పాడు. ప‌ళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బ‌లు అన్న‌ట్టుగా నాపై ఎలాంటి వార్త‌లు వ‌చ్చినా కూడా తాను పెద్దగా ప‌ట్టించుకోన‌ని నాగ్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news