Moviesమ‌ళ్లీ హాస్ప‌ట‌ల్లో క‌మ‌ల్‌హాస‌న్‌.. ఒక్క‌టే టెన్ష‌న్‌...!

మ‌ళ్లీ హాస్ప‌ట‌ల్లో క‌మ‌ల్‌హాస‌న్‌.. ఒక్క‌టే టెన్ష‌న్‌…!

భార‌తీయ సినిమా ప‌రిశ్ర‌మ గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుల్లో క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా ఆయ‌న త‌న సినిమాల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తూనే ఉన్నారు. ఆ మాట‌కు వ‌స్తే క‌మ‌ల్ త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇక క‌మ‌ల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాజ‌కీయ ప‌రంగా ఆయ‌న సిద్ధాంతాలు వేరు అయినా కూడా న‌టుడిగా మాత్రం అంద‌రూ ఆయ‌న అభిమానులే..!

ఇప్ప‌టికీ వ‌య‌స్సు పై బ‌డినా క‌మ‌ల్ మాత్రం త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో సినిమాలు చేస్తూనే వ‌స్తున్నారు. అయితే తాజాగా క‌మ‌ల్ స్వల్ప వ్య‌వ‌ధిలో రెండుసార్లు ఆసుప‌త్రి పాలు కావ‌డంతో ఆయ‌న అభిమానులు అంద‌రిని తీవ్రంగా ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం క‌రోనా భారీన ప‌డిన ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే ఆయ‌న స్వ‌యంగా హాస్ప‌ట‌ల్ నుంచి ఎవ్వ‌రూ త‌న గురించి ఆందోళ‌న చెంద‌వద్ద‌ని చెప్పారు.

క‌రోనా నుంచి కోలుకున్న‌క‌మ‌ల్ ఇప్పుడు మ‌రోసారి ఆసుప‌త్రి పాలవ్వ‌డంతో చిత్ర ప‌రిశ్ర‌మ అంతా ఒక్క‌సారిగా ఉలికిపాటుకు గురి అవుతోంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ చెన్నైలో శ్రీరామ‌చంద్ర ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పైకి మాత్రం జ‌న‌ర‌ల్ చెక‌ప్ అని చెపుతున్నారు. అభిమానులు మాత్రం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు ఆసుప‌త్రి పాల‌వ్వ‌డం ఏంటా ? అని ఆందోళ‌న‌తో ఉన్నారు.

 

ఇదిలా ఉంటే క‌మ‌ల్ త‌మిళ బిగ్‌బాస్ 5వ సీజ‌న్‌ను కూడా హోస్ట్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఈ గ్రాండ్ ఫినాలే కూడా కంప్లీట్ అయ్యింది. ఏదేమైనా క‌మ‌ల్ త్వ‌ర‌గా కోలుకుని మ‌ళ్లీ మంచి సినిమాల‌తో మ‌న ముందుకు రావాల‌ని ఆశిద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news