‘జబర్దస్త్’ అనే కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో రష్మీ కూడా ఒకరు. రష్మి ..జబర్ధస్థ్ అనే షో ద్వారా బాగా పాపులర్ అయిన యాంకర్. అంతకముందు సినిమాలు చేసిన పెద్ద గుర్తింపు రాలేదు. కానీ ఈ కామెడీ షో ద్వార ఆమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా, షో అయినా ఆమె ఉండాల్సిందే. ఇక ఆమె తో పాటు సుధీర్ కూడా ఉంటేనే ఆ షో ఫుల్ టృఫ్స్ తో దుమ్ముదులిపేస్తుంది.
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది తమ టాలెంట్లతో పాపులర్ అయ్యారు. అయితే, కొందరు మాత్రమే జంటలుగా పేరు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో చాలా కాలంగా జోడీగా సందడి చేస్తోన్న సుడిగాలి సుధీర్.. రష్మీ గౌతమ్ జంట ఒకటి. జబర్ధస్త్ అనే షో ద్వారా కలిసిన వీళ్లిద్దరూ దాదాపు ఐదారేళ్లుగా బుల్లితెరపై మజాను పంచుతున్నారు. అయితే సుధీర్ రష్మి కేవలం స్కిట్స్ తోనే కాదు..రీయల్ లైఫ్ లోను యాంకర్ రష్మీతో డేటింగ్ లో ఉన్నాడు అంటూ గత కొంత కాలంగా నెట్టింట వస్తూనే ఉన్నాయి. వీళ్లు కూడా మేము మంచి ఫ్రెండ్స్ అంటూ చెప్తూనే ఉన్నారు. కానీ ఎవరు నమ్మడం లేదు.
ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో సుధీర్ కి రష్మి ప్రపోజ్ చేసింది. దీంతో అందరు అది నిజం అనుకున్నారు. కానీ అది స్కిట్ లో భాగం అని తెలిసి డిస్సపాయింట్ అయ్యారు. ఇక ఆ ఈవెంట్ లో రష్మి వేసుకున్న డ్రెస్ లాంటిదే శాంతిస్వరూప్ కూడా వేసుకుని ఫోటోకి ఫోజులిచ్చాడు.
దీంతో ఓ నెటిజన్ రష్మికి సుధీర్ అంటే ఇష్టం లేదని..అసహ్యం అని అందుకనే ఆయంకు ప్రపోజ్ చేసిన డ్రెస్ శాంతిస్వరూప్ కి ఇచ్చేసిందని..కామెంట్స్ చేసాడు. దీని శాంతి స్వరూప్ రిప్లై ఇస్తూ..దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇది రష్మి డ్రెస్ కాదు..నాకు ఆ డ్రెస్ నచ్చి అలాంటిదే మరొకటి డిజైన్ చేయించుకున్న అంటూ బదులిచ్చాడు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.ఇదిలా ఉంటే.. రష్మీ చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
View this post on Instagram