శ్రీకాంత్ ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కెరీర్ స్టార్టింగ్‌లో శ్రీకాంత్‌కు హీరో ఛాన్సులు అంత త్వరగా రాలేదు. సీతారత్నంగారి అబ్బాయి లాంటి సినిమాల్లో విలన్‌గా చేశాడు. తర్వాత హీరోగా వచ్చాక పెళ్లిసందడి లాంటి హిట్లు పడడంతో హీరోగా నిలదొక్కేశాడు. అక్కడ నుంచి శ్రీకాంత్ ఓ పదేళ్ల పాటు వెనక్కు తిరిచూసుకోకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోయాడు. 100కు పైగా సినిమాల్లో నటించిన శ్రీకాంత్‌కు ఫ్యామిలీ హీరోగాను, మహిళలు మెచ్చే హీరోగానే క్రేజ్ ఉండేది.
హీరోగా ఛాన్సులు తగ్గిపోయాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో చరణ్‌కు బాబాయ్‌గా నటించాడు. ఆ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్వకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమాలో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రలోనే కనిపించాడు. ఇక తాజాగా బాలయ్య అఖండ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా మారాడు.
అఖండలో బాలయ్యను ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో కనిపించిన శ్రీకాంత్ అంతకు ముందే నాగచైతన్య యుద్ధం శరణంలో కూడా విలన్ గా నటించారు. అఖండ తర్వాత విలన్‌గా శ్రీకాంత్‌కు మంచి బ్రేక్ రావడం అయితే ఖాయంగా ఉంది. ఇదిలా ఉంటే శ్రీకాంత్ , ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆన్‌స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా పండితే ఇంకేముందు ఏదేదో ఊహించేసుకుంటారు.
శ్రీకాంత్ తన తాజా ఇంటర్వ్యూలో 1990ల్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న సౌందర్య, రాశీ, రమ్యకృష్ణ, రోజా గురించి మాట్లాడారు. తామంతా ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉండేవాళ్లమని.. ఈ క్రమంలోనే సెట్స్‌లో వాళ్లు వరుసలతో పిలుచుకునేవారట. రోజా శ్రీకాంత్‌ను అన్నయ్యా అని పిలిచేదట. చివరకు రొమాంటిక్ సన్నివేశాల సమయంలో కూడా రోజా అన్నయ్య అనే పిలిచేదట.
అప్పుడు శ్రీకాంత్‌కు చిర్రెత్తుకొచ్చి ఎహే నువ్వు అన్నయ్యా అనడం ఆపు.. అలా అంటుంటే నాకు రొమాంటిక్ మూడ్ రావడం లేదని కసురుకునేవాడట. శ్రీకాంత్ తాజాగా సరదాగానే ఈ విషయం బయట పెట్టాడు.