టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ థియేటర్లలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మనోడు నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాలేదు. రాజమౌళి త్రిపుల్ ఆర్‌కే మూడేళ్లు కేటాయించాడు. మరోవైపు కరోనా కూడా రెండు దశల్లో రావడంతో ఈ సినిమా రిలీజ్ పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ అని భారీ ఎత్తున పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్లు చేశారు.
ఒమిక్రాన్ దెబ్బతో మరోసారి ఈ సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు రిలీజ్ చేస్తామంటూ రెండు డేట్లు వేసుకుని కూర్చొన్నారు. ఈ సినిమా పని పూర్తిచేసిన ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు. ఆచార్యను కంప్లీట్ చేస్తోన్న కొరటాల ఎన్టీఆర్ సినిమాపై వర్క్ స్టార్ట్ చేశాడు. యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్‌కు ఖచ్చితంగా పాన్ ఇండియా మార్కెట్ వస్తుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లైనప్ చూస్తే పిచ్చెక్కిపోయేలా ఉంది. కొరటాల శివ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మధ్యలో ఆగిపోయిన సినిమా ఎప్పుడైనా ఉండొచ్చు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో క్రేజీ పాన్ ఇండియా సినిమా రాబోతోంది. కంప్లీట్ యాక్షన్ సినిమాగా ఈ ప్రాజెక్టు ఉంటుందట. మైత్రీ వాళ్లు నిర్మించే ఈ సినిమా బడ్జెట్ రు. 300 కోట్లు అంటున్నారు.
ఇక కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కూడా ఎన్టీఆర్ సినిమా ఉంది. ఈ విషయాన్ని అట్లీ కూడా గతంలోనే కన్‌ఫార్మ్ చేశాడు. కోలీవుడ్‌లో అట్లీ క్రేజీ డైరెక్టర్. అట్లీతో ఎన్టీఆర్ సినిమా పడితే సౌత్ ఇండియా మార్కెట్‌తో పాటు కోలీవుడ్ మార్కెట్ కూడా పెరుగుతుంది. ఏదేమైనా ఇప్పటికే ఐదు వరుస హిట్లతో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు అదిరిపోయే లైనప్‌తో కెరీర్‌ను బాగా డిజైన్ చేసుకుంటున్నాడు.