సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగి పోవాలని వెండితెరపై హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది అమ్మాయిలు కలలుకంటూ ఉంటారు. కొన్ని వందల మంది అమ్మాయిలు వెండితెరపై హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి పోవాలని వస్తుంటారు. అయితే వాళ్లలో హీరోయిన్ కావడంతో పాటు… స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఢిల్లీ అమ్మాయి రాశీఖన్నా మంచి చదువు చదువుకుని ఐఏఎస్ అవ్వాలని కలలు కనేది అట. అలాంటి రాశిఖన్నా అనుకోకుండా మోడలింగ్ లోకి వచ్చి ఇప్పుడు సడన్‌గా హీరోయిన్ గా మారింది.
రాశీఖన్నా మంచి క్లవర్ స్టూడెంట్.. బి.ఏ ఇంగ్లీష్ లిటరుచర్ చేసిన ఆమె ఐఏఎస్ అవ్వాలని అనుకునేదట. ఆ తర్వాత ఆమె మోడలింగ్, ఆ తర్వాత కాపీ రైటర్‌గా పనిచేసేది అట. ఆ తర్వాత సడెన్‌గా సినిమా ఛాన్సులు రావడంతో హీరోయిన్‌గా మారింది. ఇక తెలుగులో హీరోయిన్‌గా రాశీకి మంచి ఛాన్సులే వచ్చాయి. ముందుగా బాలీవుడ్‌లో మద్రాస్ కేఫ్ సినిమాతో హీరోయిన్ అయిన ఆమె ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించింది.
ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే వేళ సినిమాలో తొలిసారిగా నటించింది. అప్పటి నుంచి తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య పక్కన ఆమె థ్యాంక్ యు, గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాల్లో కూడా నటిస్తోంది. తమిళ్‌లో వరుసగా నాలుగు సినిమాలకు ఓకే చెప్పింది.
బాలీవుడ్‌లో యోధ సినిమా చేస్తోంది. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేడు సంవత్సరాలు అవుతున్నా స్టార్ హీరోల పక్కన పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎన్టీఆర్ జైలవకుశ సినిమాలో మాత్రమే నటించింది. అయితే తెలుగులో టైర్ టు హీరోలకు మాత్రం ఆమె బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. అందుకే వరుసగా యంగ్ హీరోలతోనే జతకడుతోంది.