సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఏజ్ పై బడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోకుండా లైఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు ఫేడవుట్ అయిపోయినా కూడా ఇంకా ఛాన్సులు వస్తాయేమోనని ఆశలతో ఉంటున్నారు. కొందరు హీరోయిన్లు 40 ఏళ్లు వచ్చినా పెళ్లి అన్న ముక్కే అనడం లేదు. మరి కొందరు మాత్రం 50 ఏళ్లు దాటిని పెళ్లి చేసుకోవట్లేదు. ఈ ముదురు హీరోయిన్లు ఎవరో ? ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.
1. సితార :
టీవీ సీరియల్ ద్వారా పాపులర్ అయిన సితార ప్రస్తుతం వెండితెరతో పాటు ఇటు బుల్లితెర మీద కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది. ఈమె వయస్సు 47 సంవత్సరాలు. అయినా కూడా ఆమె ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు.
2.నగ్మా :
తెలుగుతో పాటు అటు బాలీవుడ్, భోజ్‌పురి భాషల్లో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన నగ్మా వయస్సు నాలుగున్నర పదులు దాటేసింది. అయినా ఆమె ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. ఒకప్పుడు కోలీవుడ్ సీనియర్ హీరో శరత్‌కుమార్‌తో ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సారవ్ గంగూలీతో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి.
3.సుస్మితా సేన్ :
బాలీవుడ్ నటి.. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ తెలుగులో నాగార్జున పక్కన రక్షకుడు సినిమాలో నటించింది. ఆమె ఎంతోమందితో ఎఫైర్లు కొనసాగించిందన్న వార్తలు వచ్చాయి. తాజాగా రోహ్మన్ షాల్‌తో కొద్ది ఏళ్లుగా డేటింగ్ చేస్తోన్న ఆమె ఇప్పుడు అతడికి కూడా గుడ్ బై చెప్పేసింది. ఆమె వయస్సు 45 సంవత్సరాలు.
4. శోభన :
మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, మోహన్‌బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన శోభన వయస్సు 50 ఏళ్లు దాటింది. ఆమె ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. భరతనాట్య ప్రదర్శనలతో పాటు శిక్షణ ఇస్తూ లైఫ్ గడిపేస్తోంది.
5. టబు:
టబు టాలీవుడ్, బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. 50 ఏళ్లు దాటినా కూడా ఆమె ఇప్పటకి పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో పడి అలాగే ఉండిపోయిందని అంటారు.
6. నర్గస్ ఫక్రీ :
బాలీవుడ్లో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్ వయస్సు 44 సంవత్సరాలు. ఈ వయస్సులోనూ పెళ్లి అంటే మాత్రం వద్దు అని చెబుతోంది.
ఇంకా ఈ లిస్టులో మూడున్నర పదుల వయస్సుకు చేరువైన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఈ లిస్టులో నయనతార, అనుష్క, అంజలి, త్రిష ఇలా చాలా మందే ఉన్నారు.