తాప్సీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితమే తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యిన ఈ బ్యూటీ..ఇంకా టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో ఉందంటే ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ఆలోచించక్కర్లేదు. తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఝుమ్మంది నాదం సినిమాతో పరిచయంది వయ్యారి భామ తాప్సీ తెలుగులో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ అందాల భామ..కొన్ని సినిమాలు చేసి.. దూసుకుపోతున్న సమయంలోనే తమిళ్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంది.
ఇలా తెలుగు తమిళ్ లో బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సొట్ట బుగ్గల సుందరి..ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే తాప్సీనే గుర్తుకు వస్తోంది.
ఇక సినిమాల పరంగానే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ..మీడియాలో హెడ్ లైన్స్ లో నిలుస్తూ హాట్ టాపిక్ గా ట్రేండ్ అవుతుంటుంది ఈ భామ. బాయ్ ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్, మ్యారేజ్, డేటింగ్ ఇలాంటి పర్సనల్ విషయాలని సెలెబ్రిటీలు వీలైనంత ఎక్కువగా గోప్యంగా ఉంచుతారు. కానీ తాప్సి మాత్రం తన లైఫ్ లో జరిగిన ఓ చేదు అనుభవాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా.. రేం మొహమాటమే లేకుండా యస్ అవును అంటూ చెప్పేసింది.
“నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను అని స్మైల్ తోనే ఆన్సర్ ఇచ్చింది. దీంతో యాంకర్ తో పాటు ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇక బోయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. మా నాన్న ఒక్క తప్పుని కూడా కనిపెట్టలేకపోయరు. దీని బట్టి అర్ధం చేసుకోండి అతని మంచితనం. నిజానికి మా నాన్న అన్నింట్లో తప్పులు వెతుకుతుంటారు. కానీ అతడి విషయంలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు” అని తాప్సి చెప్పుకొచ్చింది.