ప్రజెంట్ ఏపిలో ఎలాంటి పరిస్ధితులు నెలకొన్నాయో మనకు తెలిసిందే. టాలీవుడ్ VS జగన్ ప్రభుత్వం అన్నట్లు తయారైంది పరిస్ధితి. ఏపీలో టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో నెం.35ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తగ్గింపు టికెట్ రేట్లతో థియేటర్లు రన్ చేయలేమని స్వచ్ఛందంగా థియేటర్లని మూసేసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. దాదాపు 175కిపైగా థియేటర్లు మూత పడినట్టు సమాచారం.
మరోవైపు టికెట్ల రేట్లకి సంబంధించి పలువురు సినీ హీరోలు జగన్ ప్రభుత్వం పై మడిపడుతున్న తరుణంలో నిర్మాత దిల్రాజు కూడా ఎంటర్ అయ్యి..తొందర పడి ఏం మాట్లాడకండి..అన్ని సర్ధుకుంటాయి.. ఏపి ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈ ఇష్యూ లోకి వర్మ ఎంటర్ అయ్యి తందైన స్టైల్ లో స్పందించారు. నిజం చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం దిగ్గి వచ్చింది వర్మ ట్వీట్ల వర్షానికే. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే కాకుండా..రివర్స్ కౌంటర్ లు కూడా వేస్తూ దట్ ఇజ్ వర్మ అనిపించాదు.
ఇక సీన్ కట్ చేస్తే జగన్ నుండి చిరంజీవికి పిలుపు వచ్చింది. ఇన్ని రోజులు అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వని జగన్ ఇప్పుడు పిలిచి మరి డిస్కషన్స్ పెట్టించారు. ఇక ఇదే విషయమై నాగార్జున మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసారు. చిరంజీవి జగన్ ను కలవబోతున్నారని నాకు ముందే తెలుసు..వారం రోజుల ముందే నాకు చిరంజీవి చెప్పారు.. ఇక నేను బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాను..ఖచ్చితంగా జగన్ సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం నాకు ఉంది”..అంటూ చెప్పుకొచ్చారు.