Moviesఅదే కనుక జరిగితే నాగార్జునకి మంచి రోజులు వచ్చిన్నట్లే ..?

అదే కనుక జరిగితే నాగార్జునకి మంచి రోజులు వచ్చిన్నట్లే ..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన శైలీలో అక్కినేని నాగేశవరావు నటించి అభిమానులను మెప్పించి కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని నాగార్జున కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాథలు సంపాదించుకున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న అక్కినేని నాగార్జున తన మూడున్నర దశాబ్దాల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. నిన్నే పెళ్ళాడుతా సినిమాలో రొమాంటిక్ బాయ్ గా కనిపించినా నాగార్జున శివ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించాడు. అలాగే అన్నమయ్య – శ్రీరామదాసు లాంటి భక్తిరస పాత్రల‌లో అలా ఒదిగిపోయిన నాగార్జున మజ్ను సినిమాలో ఓ భగ్న ప్రేమికుడిగా చేశాడు. క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయి జీవించడం నాగార్జునకు వెన్నతో పెట్టిన విద్య.

అయితే ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాగచైతన్య,అఖిల్ మాత్రం తండి అంత గొప్ప పేరు సంపాదించుకోలేక పోయారు. సినిమాలు చేస్తున్నారే కాని అవి హిట్ టాక్ తెచ్చుకోకపోవడం ఒక్క మైనస్ అయితే నటన పరంగా కూడా వాళ్లు ఫ్లాప్ అవుతున్నారు. నాగచైతన్య అయినా మూడు నాలుగు హిట్ సినిమా లు పట్టాడు కానీ అఖిల్ అయితే నిల్..ఏదో పూజా దయ వల్ల ఆమె అందాలు ఆరబోయడం వల్ల ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ లేకపోతే అఖిల్ ఖాతాలో ఒక్కటి కూడా హిట్ పడేది కాదు.

ఇక కరోనా మహమ్మారి కారణంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో సంక్రాంతి రేస్ లోకి చిన్న చిన్న సినిమాలు వచ్చాయి. ఇక ఆ లిస్ట్ లో నాగచైతన్య నటించిన బంగార్రాజు కూడా ఉంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన్ ట్రైలర్ బట్టి ఈ సినిమా బాక్స్ ఆఫిస్ దగ్గ భారీ విజయాని నమోదు చేస్తుందని నమ్ముతున్నారు అభిమానులు.

ఈ సినిమా హిట్ అయితే ఇక నాగచైతన్య కెరీర్ గురించి నాగ్ ఆలోచించనవసరం లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక్కవేళ ఇలాగే కొనసాగి చైతన్య బంగార్రాజు సినిమా..అఖిల్ ఏజెంట్ సినిమాలు హిట్ అయితే నాగార్జున కొడుకుల భవిష్యతు గురించి ఆలోచించనక్కర్లేదు ..నాగ్ సేఫ్ జోన్ లోకి వెళ్లిన్నట్లే అంటున్నారు సినీ ప్రముఖులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news