తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం అని చెప్పి కొంతమంది ఫెయిల్యూర్ పీపుల్ లిస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా నిఖిల్‌ని చూసి నేర్చుకోవాలి. హ్యాపీడేస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కూడా మొదట్లో మాస్ జపమే చేశాడు. నెక్ట్స్ టు రవితేజ అంటూ వరుస డిజాస్టర్స్ ఫేస్ చేశాడు. కానీ ఒక సారి ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత మాత్రం కుంగిపోకుండా తన కెరీర్ గురించి తాను నిజాయితీగా విశ్లేషించుకున్నాడు. తను వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ చిత్రంలో రాజేశ్ అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యాడు నటుడు నిఖిల్ సిద్ధార్థ్. తొలి సినిమాలోనే తనదైన నటనతో యూత్‌ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో నిఖిల్ వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. వరుస పరాజయలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో వచ్చిందే ‘స్వామి రారా’ సినిమా. ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత కార్తికేయ, సుబ్రమణ్యపురం, ఎక్కడికి వెళతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం ఇలా వరుస విజయాలను అందుకొని మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు నిఖిల్.
ఇకపోతే నిఖిల్ కెరీర్ స్టార్టింగ్‌లో ఓ సీరియల్‌లో నటించాడు. కానీ, ఈ విషయం దాదాపు చాలా మందికి తెలియదు. నిఖిల్ నటించిన సీరియల్ `చదరంగం`. ఈ సీరియల్ చాలా ఏళ్ల కిందట ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్‌లో రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణిలతో పాటు హీరో నిఖిల్ కూడా ఓ బుల్లి పాత్రను పోషించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి టాలీవుడ్‌లో హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా నటిస్తున్నాడు. అలాగే 18- పేజీస్ అనే మరొక సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో కథానాయకిగా అనుపమ పరమేశ్వరన్ నే నటిస్తోంది.