రష్మిక మందన ..అమ్మ బాబోయ్ అమ్మడుకి స్టార్ హీరో కన్నా కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. నేష్నల్ క్రష్ గా మారిపోయిన ఈ హాట్ బ్యూటీ తెలుగు,తమిళ,హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ కన్నడ సోయగం..క్షణం కూడా తీరిక లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్ ను పీక్స్ లో ఉంచుకుంటుంది.
శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది. అగ్ర హీరోలందరితో సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ లో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తున్నా కానీ ఈ అందాల ముద్దుగుమ్మ ప్లేస్ ని మాత్రం రీప్లేస్ చేయలేకపోతున్నారు. తన క్యూట్ క్యూట్ లూక్స్ తో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మిక.
రీసెంట్ గా అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించిన ఈ భామ తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకుంది. పాన్ ఇండియాగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీవల్లిగా పుష్పరాజ్‌నే కాకుండా ప్రేక్షకుల మదిని దోచింది ఈ బ్యూటీ. శ్రీవల్లి పాత్రలో తను చేసిన పర్ ఫామెన్స్ అందరిని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ తో వచ్చే సన్నివేశాలల్లో అమ్మడు నటించిన సీన్స్ అయితే కేకపెట్టించాయి. ఇక ఈ సినిమా రీసెంట్ గానే అమెజాన్ ప్రైం లో స్టృఈమింగ్ అయ్యింది. ఇక మరోసారి టీవిల్లో సినిమా చూస్తూ ఎంజాయ్ చేసారు బన్నీ ఫ్యాన్స్.
కాగా..పుష్ప సినిమా చివర్లో నటీనటుల పేర్లు వేస్తారని ప్రతీ సినిమా ప్రేక్షకుడుకి తెలుసు. ఆ టైటిల్స్‌లో రష్మిక మందన్నాకు బదులు రష్మిక మడోనా అని తప్పుగా వేశారు. ఇంకేం దీంతో మన నెటిజన్స్ నెట్టింట ఆ స్క్రీన్ షాట్ తో ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగులో తప్పుగా వచ్చిందంటే అంతగా ఎవ్వరూ పట్టించుకోలేకపోయేవారేమో. కానీ ఇంగ్లీష్‌లో పెద్ద పెద్ద అక్షరాల్లోనూ రష్మిక మందన పేరు తప్పుగా వచ్చింది. ఇంకేముంది రష్మిక మందన పేరు కాస్తా.. రష్మిక మడోన గా మారిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.