Moviesఅనుష్క కెరీర్‌లో తొలి సారి ఐటెం సాంగ్ చేసింది ఏ హీరో...

అనుష్క కెరీర్‌లో తొలి సారి ఐటెం సాంగ్ చేసింది ఏ హీరో కోస‌మో తెలుసా?

గ‌తంలో ఐటెం సాంగ్స్ చేసేందుకు ప్ర‌త్యేకంగా నటీమ‌ణులు ఉండేవారు. కానీ, ప్ర‌స్తుత రోజుల్లో హీరోయిన్లే ఐటెం సాంగ్స్ చేస్తూ అల‌రిస్తున్నారు. స‌మంత‌, పూజా హెగ్డే, త‌మ‌న్నా, కాజ‌ల్‌ వంటి స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేసేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. అలాగే ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సైతం ఓ సారి ఐటెం భామ మారింది.

అనుష్క తొలి సారి ఐటెం సాంగ్ చేసింది ఏ హీరో కోస‌మో తెలుసా..? మెగాస్టార్ చిరంజీవి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `సూపర్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క‌.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `విక్రమార్కుడు`తో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు అందుకుని అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న అనుష్క‌.. `స్టాలిన్` సినిమాతో స్పెష‌ల్ సాంగ్ చేసింది.

చిరంజీవి హీరోగా ఎ.ఆర్. మురుగ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా న‌టించింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై నాగ‌బాబు నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ చిత్రంలోనే అనుష్క మొద‌టి సారి మ‌రియు చివ‌రి సారి ఐటెం సాంగ్ చేసింది. స్టాలిన్ త‌ర్వాత మ‌రే చిత్రంలోనూ అనుష్క ఐటెం సాంగ్ చేయ‌లేదు.

కాగా, అనుష్క సినిమాల విష‌యానికి వ‌స్తే.. లాంగ్ గ్యాప్‌ త‌ర్వాత ఇటీవ‌లె ఈ బ్యూటీ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. న‌వీన్ పొలిశెట్టి ఇందులో హీరోగా న‌టిస్తుండ‌గా..పి.మహేశ్‌బాబు దర్శకత్వం వ‌హించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news