Moviesఅన‌సూయ ఆ ప‌ని చేయ‌క‌పోతే విడాకులా... ఏం ట్విస్ట్ ఇచ్చార్రా బాబు..!

అన‌సూయ ఆ ప‌ని చేయ‌క‌పోతే విడాకులా… ఏం ట్విస్ట్ ఇచ్చార్రా బాబు..!

బుల్లితెరపై యాంకర్‌గా తన ప్రస్థానం ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత క్రమక్రమంగా పాపులర్ అయి వెండితెరపై కూడా మంచి అవకాశాలు సొంతం చేసుకుంటోంది. న్యూస్ ప్రెజెంటర్స్ గా కెరీర్ స్టార్ట్ చేసి బుల్లితెరపై యాంకర్ అనే పదాన్ని హాట్ హాట్ గా మార్చిన ఘనత కూడా అనసూయ దక్కుతుంది. బుల్లితెరపై అనసూయ యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్ టిఆర్పి రేటింగ్ లు ఎలా ? ఉంటాయో చూస్తూనే ఉన్నాం. బుల్లితెరపై అనసూయ యాంకరింగ్ చేస్తున్న జబర్దస్త్ ప్రోగ్రాం టీఆర్పీ రేటింగ్‌ ఎలా ? ఉందో తెలిసిందే.

బుల్లితెర‌పై ఎన్ని ప్రోగ్రామ్స్ వ‌చ్చినా జ‌బ‌ర్ద‌స్త్‌ను కొట్టే ప్రోగ్రామే లేదు. ఆ తర్వాత అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర‌తో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ తర్వాత క్ష‌ణం లాంటి థ్రిల్ల‌ర్‌ సినిమాల్లో కీలక పాత్రతో మెప్పించింది. తాజాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో మరోసారి దాక్షాయ‌ణి పాత్ర‌లో మెరిసింది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో వెండితెర ప్రేక్షకుల అభిమానం కూడా సొంతం చేసుకుంది. ఆతర్వాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

ఇప్పుడు సినిమాల్లో నటించాలంటే అనసూయకు టాప్ రెమ్యూనరేషన్ చెల్లించాల్సిందే. అలాగే సాయిధరమ్తేజ్ హీరోగా వచ్చిన విన్నర్ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ కూడా చేసింది. అన‌సూయ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు విందు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఎప్పుడూ నెటిజన్లలో ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది.

తన గురించి ఎవరైనా కాస్త ఘాటుగా కామెంట్ చేస్తే తనదైన శైలిలో వెంటనే కౌంట‌ర్ కూడా ఇస్తూ ఉంటుంది. ఇలా నిత్యం నెటిజన్లకు అన‌సూయ‌కు సోషల్ మీడియాలో వార్‌ నడుస్తూనే ఉంటుంది. తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా అన‌సూయ భ‌ర్త తీసిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అందులో అన‌స‌య చేతిపై టాటూ ఉంది.

దీంతో కొంద‌రు నెటిజ‌న్లు అన‌సూయా వెంట‌నే ఆ టాటూ తీసేయ్‌.. చేతిపై టాటూలు వేయించుకున్న వారు విడిపోతున్నారు. నాగ‌చైత‌న్య – స‌మంత‌, ష‌ణ్నుక్‌, దీప్తి సున‌య‌న కూడా ఇలాగే టాటూలు వేయించుకుని విడిపోయార‌ని.. నీ చేతిపై అదో దర‌ద్రం అది వ‌ద్దు తీసేయ్ అంటూ కామెంట్ పెడుతున్నారు. మ‌రి ఈ కామెంట్ల‌పై అన‌సూయ నుంచి ఎలాంటి రిటాక్ట్ ఉంటుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news