సినిమారంగంలో మొదటి నుంచి ఒక విషయంలో ఎక్కువగా పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. ఒకటి రెండు సినిమాల్లో ఒక హీరో… హీరోయిన్ కలిసి నటించారు అంటే వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే చాలు వారిద్దరి మధ్య లేనిపోని పుకార్లు మీడియాలో వచ్చేస్తూ ఉంటాయి. ఇక దర్శక, నిర్మాతలు కూడా ఒక హీరో.. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే పదే పదే ఆ జంట తోనే సినిమాలు తీసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో బాలయ్య – విజయశాంతి, చిరంజీవి – రాధిక కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సమయంలోనే ఈ రెండు జంటల మధ్య చాలా పుకార్లు షికార్లు చేశాయి.
ఇక ప్రేక్షకులు కూడా ఈ జంట తెర మీద కనిపిస్తే మరో సారి చూడాలని ఆశ తో ఉంటారు. సీనియర్ హీరో సురేష్, టాలీవుడ్ లో ప్రస్తుతం అత్తగా పాపులర్ అయిన నదియా జంట కూడా కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. వారిద్దరూ కలిసి నటించిన ఓ తమిళ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో వరుసగా కొన్ని సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరూ కలిసి ప్రతి సినిమాలో కనిపిస్తూ ఉండటంతో… వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని సురేష్ – నదియా పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం అయితే అప్పట్లో బయటకు వచ్చింది. దీనికి తోడు తమిళ పత్రికలు కూడా ఇదే తరహా వార్తలు రాసేవి.
దీంతో వారిద్దరి మధ్య ప్రేమ వార్తలు బాగా హైలైట్ అయ్యాయి. ఇదే విషయంపై సురేష్‌ను అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే తాము కేవలం స్నేహితులం మాత్రమే అని… తమ మధ్య ఎలాంటి ఆలోచనలు లేవని చెప్పుకొచ్చాడు. అప్పట్నుంచి సురేష్ ఒకే హీరోయిన్‌తో కాకుండా హీరోయిన్లను మారుస్తూ సినిమాలు చేసేవాడు. తమపై ఈ పుకార్లు వచ్చాక నదియాతో కలిసి నటించే అవకాశం వచ్చినా సురేష్ ఒప్పుకోలేదట.
ఆతర్వాత సురేష్ అప్పట్లో హీరోయిన్ గా ఉన్నా అనిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయి మళ్ళీ వేర్వేరు వివాహం చేసుకున్నారు. ఇక నదియా 1988 శిరీష్ గాడ్బోలే అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. తర్వాత అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయినా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో అత్త – అమ్మ క్యారెక్టర్లు చేస్తున్నారు.