Moviesఎన్టీఆర్ కంటే రు. 5 వేలు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ అడిగిన క్రేజీ...

ఎన్టీఆర్ కంటే రు. 5 వేలు త‌క్కువ రెమ్యున‌రేష‌న్ అడిగిన క్రేజీ హీరోయిన్‌…!

నందమూరి బాలకృష్ణ తాతమ్మకల సినిమాతో తొలిసారిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. తన తండ్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తాతమ్మకల సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో తాతమ్మ పాత్రలో భానుమతి నటించారు. భానుమతి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఆ తరం నటుల్లో ఎన్నో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించారు. ఆమెకు ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేసేవారు. నాటి నటులు అయిన ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ లతో పోటీ పడి మరీ భానుమతి నటించారు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ అంటే భానుమతికి ప్రత్యేకమైన అభిమానం. అలాగే భానుమతి అన్నా కూడా ఎన్టీఆర్ ఎంతో గౌరవంతో చూస్తారు. తాతమ్మకల సినిమాలో భానుమతి తాత‌మ్మ పాత్ర‌కు బాగుంటుందని ఎన్టీఆర్ భావించారు. అయితే ఈ పాత్రలో నటించేందుకు భానుమతి ఒప్పుకుంటారో లేదో ? అన్న సందేహం ఎన్టీఆర్‌కు ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత డి.వి.నరసరాజును ఎన్టీఆర్… భానుమతి దగ్గరికి పంపి తాతమ్మ పాత్ర గురించి వివరించమని సూచించారట‌.

అంతకుముందు అమ్మాయి పెళ్లి సినిమాలో ఎన్టీఆర్ – భానుమతి కలిసి నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో …భానుమతికి కూడా అంతే ఇచ్చారు. తాతమ్మకల సినిమాలో భానుమతి కి ఎంత రెమ్యున‌రేష‌న్ ఇవ్వాలి అన్న చర్చ రాగా ? రామారావు గారు తీసుకునే రెమ్యూనరేషన్ తో పోలిస్తే 5,000 తగ్గించి ఇవ్వమని భానుమతి అడిగారట. అమ్మాయి పెళ్లి – తాతమ్మకల ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయ్యాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news