Moviesపుష్ప సినిమాలో ఆ ఒకే ఒక్క షాట్ కోసం బన్నీ 12...

పుష్ప సినిమాలో ఆ ఒకే ఒక్క షాట్ కోసం బన్నీ 12 గంటలు కష్టపడారట..!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది వరకు వీళ్ల కాంబో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక మూడో సినిమా గా వచ్చిన పుష్ప కూడా అంతకు మించి హిట్ కొట్టి..వీళ్ల కాంబో పై అంచనాలను పెంచేసింది. వీళ్ల కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప ది రైజ్.

స్కై రేంజ్ అంచ‌నాల‌తో డిసెంబరు 17న్q థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా శేషాచ‌లం అడ‌వుల్లోని ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. రెండు భాగాలుగా భారీ రేంజ్‌లో ‘పుష్ప’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ముందే ప్రకటించిన సుకుమార్.. అందులో తొలి భాగాన్ని ‘పుష్ప ది రైజ్’ పేరుతో ప్రేక్షకుల ముందుంచారు.

అభిమానులో అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా సుకుమార్ సినిమాలోని ప్రతి సీన్ ను అధ్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో రష్మిక మందని హీరోయిన్ గా నటించగా..స్టార్ హీరోన్ సమ్మత కెరీర్ లోనే ఫస్ట్ టైం ఐటెం నెంబర్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక సినిమా మొత్తానికి హైలెట్ అంటే బన్నీ. స్మ‌గ్ల‌ర్‌గా అల్లు అర్జున్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు.

బ‌న్నీ కెరీర్‌లో పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన పుష్ప ఏకంగా ఐదు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన పుష్ప‌ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా స్లో గా సాగినప్పటికి బన్నీ పర్ ఫామెన్స్ తో అదరగొట్టేసారు. సుకుమార్ డైరెక్షన్ బన్నీ టైమింగ్ రెండు సినిమాను ఓ రెంజ్ లోకి తీసుకుకెళ్లాయి.

అయితే ఈ సినిమా కోసం సుకుమార్ – అల్లు అర్జున మూడు సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమాలో నేచురాలిటి ఉండాలని భావించిన సుకుమార్ ప్రతి సీన్ ను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసారట. ఇక ఈ సినిమాలో లాస్ట్ లో వచ్చే ఏయ్ బిడ్డా పాట లో ఒక షాట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 12 గంటలు కష్ట పడ్డారట. ఈ విషయాని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఈ పాటలో ఓ సీన్ కోసం 24 డ్రెస్సులు మార్చారట..ఇక ఆ సీన్ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు చేసినట్లు వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హర్డ్ వర్క్ కి ఇదొక ఉదాహరణ అని చెప్పవచ్చు అంటున్నారు అభిమానులు. ఇందుకు సంబంధించిన ఫోటో ను పుష్ప టీమ్ షేర్ చేయడంతో ఈ విషయం నెట్టింత వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news