Moviesబ‌న్నీ రేంజ్ పెరిగింది.. రేటు పెరిగింది.. వామ్మో ఇంతా...!

బ‌న్నీ రేంజ్ పెరిగింది.. రేటు పెరిగింది.. వామ్మో ఇంతా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేసింది. ఆ సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా వచ్చిన అల‌ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక తాజాగా వచ్చిన పుష్ప సినిమా అయితే కరోనా కష్ట కాలంలోనూ… మరోవైపు ఆంధ్రాలో టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా కూడా ఏకంగా రు. 300 కోట్ల వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ వర్గాల మతులు పోయేలా చేసింది. ఇన్ని కష్టాల మధ్యలో వచ్చిన పుష్ప సాధించిన వసూళ్లు చూస్తుంటే టాలీవుడ్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది.

పుష్ప నార్త్‌లో సాధించిన వ‌సూళ్లే అల్లు అర్జున్ క్రేజ్ ఎలా పెరిగిపోయిందో చెబుతున్నాయి. నార్త్‌లో ఎలాంటి ప‌బ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన పుష్ప ఇప్పటికే రు. 80 కోట్లకు పైగా రాబట్టింది. ఈ సినిమా ఏపీలో టిక్కెట్ల రేట్ల త‌గ్గింపు స‌మ‌యంలో రిలీజ్ కాకపోయి ఉంటే థియేటర్లలో మరిన్ని వసూళ్లు రాబట్టేద‌ని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో పాటు అటు నార్త్ లోనూ ఇటు కేరళ – కన్నడంలోనూ తన మార్కెట్ బాగా పెరగడంతో బన్నీ తన రేటు కూడా పెంచేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఒక్కో సినిమాకి రు. 25 నుంచి 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పుష్ప పార్ట్ 2కు రు. 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇక బన్నీ ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో మరో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బన్నీ కి రు. 50 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా ఉన్నా మురుగుదాస్ లేదా అట్లీల‌లో ఎవరో ఒకరు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బన్నీ… ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగటంలో దాదాపు సక్సెస్ అయినట్టే అని చెప్పాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news