స్టైలీష్ అస్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది అభిమానులకు. చెప్పుకుంటు వెళ్లేకొద్ది ఇంకా వినాలి అనిపించే క్యారెక్టర్ బన్నీది. మెగా ఫ్యామిలీ నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోలలో ఒకరు అల్లు అర్జున్. నిజానికి చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి అడూగు పెట్టినా..సినిమా సినిమాకి తనలోని టాలెంట్ ను బయట పెడుతూ వస్తూ..ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిపోయాడు.
గంగోత్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో.. అల్లు అర్జున్.. ఆ సినిమా మంచిగా హిట్ అవ్వడంతో వరుస సినిమాలలో నటిస్తున్నారు. రీసెంట్ గానె బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి ఘన విజయాని అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. లారీ డ్రైవర్ గా బన్నీ ఆ సినిమాలో కనిపించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంది.
నిజం చెప్పాలంటే ఈ సినిమాకి బన్నీ ముందు చేసిన సినిమాలకి చాలా తేడాఉంది. ఇక్ ఈ సినిమా కోసం బన్నీ స్పెషల్ డైట్ ను ఫాలో అయ్యారట . 1,2 రోజులు కాదు ఏకంగా మూడు సంవత్సరాలు. డైట్ చేసే సమయంలో చీజ్ వంటి పాల పదార్థాలు తప్పిస్తే అల్లు అర్జున్ అన్ని పదార్థాలను బాగా తిన్నారట. అలాగే సోడియం… కొర్బొహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. పుష్ప సినిమా కోసం ఓ డైట్ ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యారట.
ఇక ఆ డైట్ ఇదే..
బన్నీ చాలా త్వరగా నిద్ర లేస్తారట. ఇక అలా ప్రతిరోజూ ఉదయాన్నే 45 నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేస్తారు లేకపోతే కొన్ని బేసిక్ జిం వర్క్ అవుట్స్ చేస్తారట. కొన్నిసార్లు కె.బి.ఆర్ పార్కులో కూడా రన్నింగ్ చేస్తారట. రోజు ఒక్క్టే కాకుండా ఢిఫరెంట్ గా మారుస్తూ ఉంటారట. ఇవ్వని వర్క్ అవుట్స్ ఎలాంటి ఆహారం.. కనీసం నీళ్లు కూడా తీసుకోకుండానే చేస్తారట బన్ని. ఇక తర్వాత కాఫీ లేదా జ్యూస్ తాగుతారట. ప్రతిరోజూ ఉదయం 7.30 -8.30 గంటల మధ్యలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. ఇక అందులోకి నాలుగు గుడ్లు సొన లేకుండా తయారు చేసిన అమ్లెట్ తీసుకుంటారు. ఇక ఆ తరువాత ఉదయం 11.30 నుంచి 12 గంటల సమయంలో ప్రీ లంచ్ తీసుకుంటారట.
ఇందులో సూప్.. గ్రీన్ సలాడ్‌ను ఉండేలా చూసుకుంటారట. లంచ్ ఎలా లేదన్న 1.30 నుంచి 2 గంటల మధ్యలో పూర్తి చేస్తారట. మాంసం, కార్పొహైడ్రేట్ పదార్థాలు, కూరగాయల మిశ్రమాన్ని తీసుకుంటారు. ఇక స్నాక్స్ గా సాయంత్రం 4.30 నుంచి 5 గంటల ప్రాంతంలో కొన్ని ఉడకబెట్టిన గింజలను తీసుకుంటారట బన్నీ. వీలైనంత త్వరగానే డిన్నర్‌ను పూర్తి చేసే బన్నీ.. అందులో బ్రౌన్ రైస్, కూరగాయలు, చికెన్ లేదా చేపలు డిన్నర్లో ఉండేలా చూసుకుంటారు అల్లు అర్జున్. ఇక అప్పుడప్పుడు అంటే చీట్ మీల్‌ను కూడా తీసుకుంటారట. ఇలా కష్టపడితేనే పుష్పలో ఆ లుక్ లో కనించారట పుష్ప రాజ్.