అక్కినేని నాగార్జున ఆరేళ్ల క్రితం సోగ్గాడే చిన్ని నాయన రూపంలో సంక్రాంతికి వచ్చారు. ఆ సినిమా చైతు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ముందు నుంచి చెపుతూ వస్తున్నారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన బంగార్రాజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి రావాల్సిన పాన్ ఇండియా సినిమాలు త్రిఫుల్ ఆర్, రాధేశ్యామ్ రెండూ వాయిదా పడడంతో నాగ్ డేర్ చేసి ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేశారు.
ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు జస్ట్ ఓకే అన్న టాక్ వచ్చింది. కథ పరంగా చూస్తే ఇది రొటీన్ స్క్రిఫ్ట్. అయితే కలర్‌ఫుల్ పాటలు, నాగార్జున, చైతు స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ఫస్టాఫ్‌లో చైతు – కృతిశెట్టి మధ్య లవ్ ట్రాక్, సర్పంచ్‌గా కృతిశెట్టి పాత్ర కాస్త ఎంగేజ్ చేశాయి. కొన్ని చోట్ల కామెడీ సీన్లు బలవంతంగా ఇరికించినట్టు ఉండి నవ్వు తెప్పించలేదు. ఇక రమ్యకృష్ణ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.
ఫస్టాఫ్‌లో చైతు, కృతిశెట్టి ట్రాక్, వెన్నెల కిషోర్ కామెడీ, ఇక చైతు తిరిగి భూమి మీదకు రావడం, సినిమాలో సోగ్గాడులో ఉన్న పాత్రలు రీ ఎంట్రీ ఇవ్వడం, ఆలయానికి సంబంధించిన సీన్లు.. కొన్ని ఎమోషనల్ సీన్లు, ట్విస్టులతో దర్శకుడు కళ్యాణ్ సినిమాను నడిపించినా.. సోగ్గాడే మ్యాజిక్ మాత్రం ఇక్కడ రిపీట్ చేయలేకపోయాడు.
ఓవరాల్‌గా చూస్తే సంక్రాంతి సీజన్ కావడంతో బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఇక అక్కినేని అభిమానులు ఓ సారి చూసే చిత్రంగా మాత్రమే బంగార్రాజు నిలుస్తుంది. అంతకు మించి భారీ అంచనాలు పెట్టుకుని చూడాల్సిన సినిమా కాదు.