టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బంగార్రాజు మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 2016 సంక్రాంతి కానుకగా వచ్చి హిట్ అయిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు కొనసాగింపుగా బంగార్రాజు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రు. 53 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆ తర్వాత బాగా స్లో అయ్యింది.
పది రోజులు పూర్తి అయినా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఓ వైపు కరోనా కల్లోలం, ఒమిక్రాన్ దెబ్బతో పాటు సెకండ్ షోలు క్యాన్సిల్ కావడం, ఏపీలో కొన్ని థియేటర్లు మూసి వేయడం, ఇటు తెలంగాణ వసూళ్లు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు, 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ లాంటి కండీషన్లు బాక్సాఫీస్ దగ్గర బంగార్రాజు జోరుకు బ్రేకులు వేశాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర హీరో, రౌడీబాయ్స్ లాంటి సినిమాలు వచ్చినా అవి ప్లాప్ అవ్వడంతో బంగార్రాజు సక్సెస్ అయిపోయింది.
9వ రోజుతో పోలిస్తే 10వ రోజు కలెక్షన్లు పుంజుకున్నాయి. ఏపీ + తెలంగాణ కలిపి ఆదివారం ఈ సినిమా రూ. 81 లక్షలు షేర్ రాబట్టింది. అలాగే రు 1.45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. పది రోజులకు ఏపీ + తెలంగాణలో రు. 53. 70 కోట్ల గ్రాస్‌తో పాటు రు. 34 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే రు. 37. 11 కోట్ల షేర్‌తో పాటు రు. 60.50 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు అవుతుంది. ఈ 10 రోజుల్లో 97 % రికవరీ అయినట్టు ట్రేడ్ లెక్కలు చెపుతున్నాయి.
కరోనా భయంతో పండగ తర్వాత జనాలు థియేటర్లకు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది. అందుకే మూడు రోజులకు రు. 53 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా 10 రోజులకు కేవలం రు. 60 కోట్లే కొల్లగొట్టింది. ఇక మరి బంగార్రాజు ఏం చేస్తాడో ? చూడాలి.