Moviesబీచ్ లో భార్యతో కలసి బాలయ్య షికార్..వీడియో వైరల్‌!!

బీచ్ లో భార్యతో కలసి బాలయ్య షికార్..వీడియో వైరల్‌!!

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే బోయపాటితో కలిసి అఖండ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో అయిన ఫస్ట్ టైం అగ్ఘోరా గా కనిపించి అభిమానులను మెప్పించాడు. ఇక ప్రస్తుతం బాలయ్య డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే గోపిచంద్ మల్లినేని సినిమా కంప్లీట్ అయిన వెంటనే..మరో స్టార్ డైత్రెక్టర్ అనీల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. అలాగే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో చేస్తున్నారు బాలయ్య. ఈ టాక్ షో రికార్డు స్థాయి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక వరుసగా బిజీ గా ఉన్న బాలయ్య సంక్రాంతి పండగను ఫ్యామిలీతో కలిసి సరదాగా జరుపుకుంటున్నారు.

ఈసారి సంక్రాంతి పండగను నందమూరి బాలకృష్ణ.. తన సోదరి పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. గత మూడు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు. సరదాగా గుర్రమెక్కి.. ఆ తర్వాత ఎడ్ల బండి నడిపి అందరిని ఆహ్లాదపరిచారు. తాజాగా ఆయన బీచ్ లో జీపు పై చక్కర్లు కొట్టారు. కారంచేడుకు సమీపంలోని చీరాల బీచ్ కు వెళ్లి సందడి చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం గుర్రం ఎక్కి హంగామా చేసిన బాలయ్య.. ఆదివారం ఉదయం చీరాల బీచ్‌లో హల్‌చల్‌ చేశారు. ఈ బీచ్ లో తన సతీమణి వసుంధరతో కలిసి జీపులో చక్కర్లు కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా చీరాల బీచ్ కు వెళ్లారు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ బీచ్ లో జీప్‌ను నడిపారు. భార్య వసుంధర ముందు సీట్ లో కూర్చోగా.. బాలయ్య వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. భార్యతో కలిసి టాప్ లెస్ జీపులో చక్కర్లు కొట్టారు. అక్కడున్న జనం బాలయ్య దంపతులను ఫోన్ వీడియో తీస్తూ కేరింతలు కొట్టారు. భార్య వసుంధర ఫ్రంట్‌సీట్‌లో కూర్చోగా.. తాను వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news