యువరత్న నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఆయన లేటెస్ట్ మూవీ అఖండ జాతర బాక్సాఫీస్ దగ్గర ఇంకా కంటిన్యూ అవుతోంది. రు. 150 కోట్ల థియేట్రికల్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఓవరాల్‌గా రు. 200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. తాజాగా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వయస్సులో అది కూడా డివైడ్ టాక్‌తో స్టార్ట్ అయిన అఖండ ఇన్ని కేంద్రాల్లో 50 రోజులు ఆడడంతో పాటు ఏకంగా రు. 200 కోట్లు కొల్లగొట్టింది అంటి బాలయ్య మానియా మామూలుగా లేదనే చెప్పాలి.
మరోవైపు బుల్లితెరపై అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ షోకు కంటిన్యూగా సీజన్ 2ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన నెక్ట్స్ సినిమాను మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమా గురించి ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వయస్సులో బాలయ్య సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారంటే బాలయ్య మానియా ఎలా ఉందో తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళంలో విడుదలైంది.
బాలయ్యకు తమిళంలో ఎప్పటి నుంచే లింక్ ఉంది. బాలయ్య పుట్టింది పెరిగింది కెరీర్ స్టార్ట్ చేసింది చెన్నైలో ఉన్నప్పుడే.. తమిళనాడులో కూడా బాలయ్యకు అభిమానులు భారీగా ఉన్నారు. అటు కన్నడంతో పాటు కర్నాకట రాజధాని బెంగళూరులోనూ బాలయ్య సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ఏదేమైనా బాలయ్య సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రావడం అంటే మామూలు రేంజ్ కాదనే చెప్పాలి.