ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మనదేశంలో కూడా కరోనా మూడో దశ వ్యాప్తి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా మూడో దశ మొదలైంది. తెలంగాణ లో ఇప్పటికే మూడో దశ వ్యాప్తి ఎక్కువుగా ఉన్న లక్షణాలు కనిపిస్తుండగా.. ఏపీలో ఇప్పుడిప్పుడే మూడో దశలోకి ఎంటర్ అవుతోన్న పరిస్థితి ఉంది. అయితే గత రెండు రోజులుగా చూస్తే ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. సగటున రోజుకు పదుల సంఖ్యలో కేసులు ఇప్పుడు వందల సంఖ్యలోకి వచ్చేస్తున్నాయి.
ప్రతి జిల్లాలకు 50 కు పైగా కేసులు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఒమిక్రాన్ వేరియంట్‌తో వచ్చిన భయం ఏం లేదని చెపుతున్నా కూడా డబుల్ ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరిగితే పరిస్థితి సెకండ్ వేవ్ కన్నా దారుణంగా ఉంటుందని అంటున్నారు. ఇక తెలంగాణలో ఈ నెల 8వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు స్టార్ట్ అవుతున్నాయి. ఏపీకి సంక్రాతి ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి.
హైదరాబాద్ నుంచి వేలసంఖ్యలో జనాలు ఆంధ్రాకు వెళతారు. అక్కడ సంక్రాంతి ఎంజాయ్ చేసేందుకు బెంగళూరు, చెన్నై నుంచి కూడా జనాలు వెళతారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా నైట్ కర్ప్యూ విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఆటోమేటిక్‌గా సెకండ్ షో ఉండదు. అదే జరిగితే సంక్రాంతికి తామరతంపరగా రిలీజ్ అవుతోన్న సినిమాలకు ఎదురు దెబ్బ తప్పదు.
ఇప్పటికే ఏపీలో సినిమా వాళ్లకు ప్రభుత్వం దెబ్బతో చుక్కలు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ వైపు థియేటర్ల మూత, టిక్కెట్ రేట్ల తగ్గింపు.. ఇప్పుడు నాలుగో షో కూడా క్యాన్సిల్ అయితే ఇండస్ట్రీకి అంతకన్నా బ్యాడ్ న్యూస్ ఏం ఉంటుంది.