Moviesఎన్టీఆర్ బావ‌మ‌రిది ఫ‌స్ట్ సినిమా డైరెక్ట‌ర్ - హీరోయిన్ - బ‌డ్జెట్...

ఎన్టీఆర్ బావ‌మ‌రిది ఫ‌స్ట్ సినిమా డైరెక్ట‌ర్ – హీరోయిన్ – బ‌డ్జెట్ డీటైల్స్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది హీరోగా వ‌స్తాడ‌ని యేడాదిన్న‌ర కాలంగా ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లో విప‌రీతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే దీనిపై ఎవ్వ‌రూ ఔన‌ని.. కాద‌ని క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇది కొంత‌కాలంగా డైల‌మాలో ఉంటోంది. అయితే ఎట్ట‌కేల‌కు ఆయ‌న హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మైంది. అన్న‌ట్టు ఎన్టీఆర్ బావ‌మ‌రిది అంటే ఎవ్వ‌రో కాదు.. ఆయ‌న భార్య ల‌క్ష్మీప్ర‌ణ‌తి సోద‌రుడు నితిన్ చంద్ర‌. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావు త‌న‌యుడు అయిన నితిన్ చంద్రను హీరోను చేసేందుకు కొద్ది రోజులుగా డ్యాన్సులు, ఫైట్ల‌లో శిక్ష‌ణ ఇస్తున్నారు.

ఇక ఇప్పుడు ఎట్ట‌కేల‌కు మ‌నోడి తొలి సినిమాకు డైరెక్ట‌ర్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. స‌తీష్ వేగేశ్న డైరెక్ష‌న్‌లో నితిన్ చంద్ర హీరోగా లాంచ్ కాబోతున్నాడు. శ‌త‌మానంభ‌వ‌తి లాంటి ఫ్యామిలీ క‌థాంశంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన స‌తీష్ ఇప్పుడు నితిన్ చంద్ర కోసం కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోయే యూత్ ఫుల్ స్టోరీ రెడీ చేశాడ‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే స‌తీష్ సినిమాలు అన్ని ఎక్కువుగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.

ముందుగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో అనుకున్నార‌ట‌. అయితే తేజ ద‌ర్శ‌క‌త్వం అంటే ఆయ‌న తానే నిర్మాత‌గా ఉంటాన‌న్న కండీష‌న్ ఉంటుంది. ఇప్పుడు స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మ సొంత ప్రొడ‌క్ష‌న్‌లోనే కుమారుడిని హీరోగా లాంచ్ చేసేందుకు నార్నే శ్రీనివాస‌రావు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ క‌థ విని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. సంప‌ద అనే క‌న్న‌డ అమ్మాయి హీరోయిన్‌. ఆమెకు ఇదే తొలి సినిమా.

ఇక గోదావ‌రి జిల్లాల్లోనే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. సినిమాకు మ‌రీ ఎక్కువ కాకుండా రు. 20 కోట్ల బ‌డ్జెట్‌తో తీయాల‌ని చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స‌పోర్ట్ ఎలాగూ ఉంటుంది. మంచి ద‌ర్శ‌కుడి చేతిలోనే నితిన్ ప‌డ్డాడు. తొలి సినిమా హిట్ అయితే మ‌నోడికి బ‌ల‌మైన పునాది ప‌డిన‌ట్టే..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news