నందమూరి బాలకృష్ణ సినిమా మానియా మామూలుగా లేదు. అఖండ సినిమా వచ్చి నెల రోజులు దాటిపోయింది. అన్ని ఏరియాల్లోనూ బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా.. ఇంకా చాలా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వీకెండ్లో అఖండ సినిమా ఆడుతున్న థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. అంటే ఆంధ్రదేశాన్ని అఖండ మేనియా ఎలా ఊపేస్తోందో అర్థమవుతోంది. మరోవైపు ఆంధ్రాలో చాలా థియేటర్లను మూసివేశారు. కొన్నిచోట్ల పుష్ప – నాని శ్యామ్‌సింగరాయ్ సినిమాలు కూడా నడుస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో ఐదో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా అఖండ థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్నారంటే బాలయ్య రేంజ్ మామూలుగా లేదని చెప్పాలి. మరోవైపు సంక్రాంతి కూడా త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ కావడం లేదు. ప్రభాస్ రాధేశ్యామ్ వాయిదా పడుతుందని అంటున్నారు. ఇక నాగార్జున బంగార్రాజు మాత్రమే సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమా. ఇది కూడా అఖండకు కలిసి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ కుదిరిందిజ
ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆరో వారంలో కూడా అఖండ థియేటర్లు హౌస్ ఫుల్ గా నడుస్తుండటంతో మరికొన్నాళ్లు ఈ సినిమాను థియేటర్స్ లో ఉంచాలని నిర్మాతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఎగ్జిబిటర్స్ ఓటీటీ రిలీజ్ ను మరో రెండు వారాల పాటు వాయిదా వేయమని నిర్మాతకు రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే డిస్నీ వాళ్లు మాత్రం తాము భారీ రేటుకు అఖండ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నామని… తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఓటిటీ లో రిలీజ్ చేస్తామని చెపుతున్నారట.
దీనిని సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తేనే తమకు ప్లస్ అవుతుందని వారు చెపుతున్నారు. మరోవైపు థియేటర్లలో ఇంకా హౌస్‌ఫుల్‌గా రన్ అవుతుండడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు మాత్రం ఓటీటీ రిలీజ్ కనీసం రెండు వారాలు అయినా వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇది మాస్ సినిమా.. దీనిని థియేటర్లలో చూస్తేనే ఆ కిక్ ఉంటుందని కూడా వారు చెపుతున్నారు. ఏదేమైనా అఖండ దెబ్బతో బాలయ్య క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలయ్య మాస్ జాతర తెలుగు ప్రేక్షకులను ఇంకా ఉర్రూతలూగిస్తేనే ఉంది.