Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో ఎవ్వ‌రూ ఊహించని స్టార్‌..!

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌లో ఎవ్వ‌రూ ఊహించని స్టార్‌..!

నందమూరి బాలకృష్ణ ఆహా టాక్ షో బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకు పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్లు కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఏ ముహూర్తాన ఈ షో స్టార్ట్ అయ్యిందో కాని అప్ప‌టి నుంచి ప్ర‌తి ఎపిసోడ్ కూడా దూసుకు పోతోంది. ఈ షో స్టార్ట్ అయ్యాక ఆహా క్రేజ్ పెర‌గ‌డంతో పాటు స‌బ్‌స్క్రిప్ష‌న్లు కూడా బాగా పెరుగుతున్నాయి. ఇక అల్లు అర‌వింద్‌కు, అటు అల్లు అర్జున్‌కు కూడా ఈ షో చాలా హెల్ఫ్ అయ్యింద‌ని చెప్పాలి.

మొద‌టి రెండు ఎపిసోడ్ల త‌ర్వాత బాల‌య్య చేతికి ఆప‌రేష‌న్ కార‌ణంగా కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాల‌య్య రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో పాటు పెద్ద పెద్ద స్టార్ల‌ను షోకు తీసుకు వ‌స్తున్నాడు. అస‌లు ర‌వితేజ లాంటి ఎవ్వ‌రూ ఊహించ‌ని హీరోను కూడా షోలోకి తీసుకు రావ‌డం.. ఇబ్బంది లేకుండానే ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌లు వేస్తూ ఉండ‌డం వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

అస‌లు బాల‌య్య ఈ రేంజ్‌లో టాక్‌ను హోస్ట్ చేస్తాడా ? ఇంత చాతుర్యం ఉందా ? అని చాలా మంది నోరెళ్ల బెడుతున్నారు. ఇక ఇప్ప‌టికే మ‌హేష్‌బాబుతో బాల‌య్య చేసిన షో కూడా షూటింగ్ పూర్త‌య్యింది. అయితే స‌రైన టైం కోస‌మే దీనిని స్ట్రీమింగ్ చేయ‌లేద‌ని అంటున్నారు. సంక్రాంతి కానుక‌గా దీనిని స్ట్రీమింగ్ చేస్తార‌ని టాక్. ఇక ఈ వారంలో రానా రాబోతున్నాడు.

ఇక ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో విజ‌య్‌దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ కూడా క‌లిసి పాల్గొన‌బోతున్నారు. ఇది కూడా సంక్రాంతికే స్ట్రీమింగ్ అవ్వొచ్చ‌ని తెలుస్తోంది. సంక్రాంతికే రానా, మ‌హేష్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఎపిసోడ‌ర్లు మూడు రోజుల పాటు వ‌రుస‌గా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు.

అదే జ‌రిగితే అంత‌కు మించిన పెద్ద పండ‌గ ఉండ‌ద‌నే చెప్పాలి. పూరి – విజ‌య్ ఎపిసోడ్లో కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ ఉంటుంద‌ని టాక్‌. ఈ ఎపిసోడ్లోనే లైగ‌ర్ సినిమా గురించి అప్‌డేట్స్ కూడా ఉంటాయ‌ట‌. ఇక ఇప్ప‌టికే బాల‌య్య – పూరి కాంబోలో పైసా వ‌సూల్ సినిమా వ‌చ్చింది. మ‌రోసారి వీరిద్ద‌రు కూడా జోడీ క‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆ ప్ర‌క‌ట‌న కూడా ఈ ఎపిసోడ్‌లో ఉండ‌వ‌చ్చని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news