అంజలా జవేరీ.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన `ప్రేమించుకుందాం రా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ..మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చిరంజీవితో చూడాలని ఉంది, బాలకృష్ణతో సమరసింహా రెడ్డి, నాగార్జునతో రావోయి చందమామ ఇలా సీనియర్ స్టార్ హీరోలందరి సరసనా ఆడి పాడి తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన అంజలా జవేరీ.. కెరీర్ పీక్ స్టేజి లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక అంజలా జవేరి భర్త కూడా ఓ నటుడే. ఇంతకీ అతడు ఎవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ రాజ్ అరోరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో మోస్ట్ స్టైలిష్ విలన్‌గా తెలుగు తెరకు పరిచయమైన తరుణ్ అరోరా.. ఆ తర్వాత కాటమ రాయుడు , జయ జానకి నాయక, అర్జున్ సురవరం వంటి సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
ఇకపోతే.. అంజలా జవేరీ భర్త తరుణ్ అరోరా ఆమె కంటే ఏడేళ్లు చిన్నవాడు. అయినప్పటికీ వీరిద్దరి మనసులు కలవడంతో.. కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి ఆపై పెద్ద సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత తమకు పిల్లలు వద్దనుకున్న ఈ జంట ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది. కాగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో చివరిగా కనిపించిన అంజలా జవేరీ ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందట. ఆమెకు తగ్గ కథ, పాత్ర వస్తే వెంటనే ఓకే చెబుతుందని గతంలో తరుణ్ రాజ్ అరోరా స్వయంగా తెలియజేశాడు.