బాలయ్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ పడితే బాక్సాఫీస్ పూనకంతో ఊగిపోతుంది. థియేటర్లు దద్దరిల్లి పోతాయి. రికార్డులు షేక్ అయిపోతాయి. ఆయన కెరీర్‌లో మంగమ్మగారి మనవడు, రౌడీఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, తాజాగా అఖండ సినిమాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా షేక్ అవ్వడంతో పాటు పాత రికార్డులకు పాతరేసేశాడు. ఇక టాలీవుడ్ చరిత్రలో ఏ హీరోకు లేని విధంగా బాలయ్యకు మాత్రమే ఓ అరుదైన రికార్డు ఉంది. బాలయ్య నటించిన 4 సినిమాలు డైరెక్టుగా 4 ఆటలతో 210 రోజులు ఆడాయి. ఇది మామూలు విషయం కాదు. ఆ నాలుగు సినిమాలు సమరసింహారెడ్డి – నరసింహానాయుడు – సింహా – లెజెండ్.
సమరసింహారెడ్డి:
బి.గోపాల్ దర్శకత్వంలో 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్షేషనల్ హిట్. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సమరసింహారెడ్డి రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కింది. ఈ సినిమా గుంటూరు కృష్ణమహాల్‌లో డైరెక్టుగా 4 ఆటలతో 227 రోజులు ఆడింది. బాలయ్య సినిమాల వరకు చూస్తే గుంటూరులో ఇదే ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
నరసింహానాయుడు:
బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్లో మరోసారి 2001 సంక్రాంతికి అదే మ్యాజిక్ రిపీట్ అయ్యింది. ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారి 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా నరసింహానాయుడు రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఆడుతుండగానే బాలయ్య భలేవాడివి బాసు సినిమా వచ్చి వెళ్లిపోయింది. అయినా కూడా నరసింహానాయుడు కొన్ని చోట్ల సంవత్సరం పాటు ఆడింది. ఈ సినిమా ఏలూరు అంబికా మినీ థియేటర్లలో రోజూ 4 ఆటలతో 275 రోజులు ఆడింది. ఈ సినిమాతోనే ఈ థియేటర్ ఓపెన్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఆ తర్వాత ఇదే అంబికా కాంప్లెక్స్‌లో లిటిల్ అంబికా థియేటర్ నిర్మించారు.. ఆ తర్వాత నరసింహానాయుడు ఆ థియేటర్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా 40 రోజుల పాటు ఆడింది. ఆ తర్వాత అదే ఏలూరులో రమామహాల్‌కు షిప్ట్ అయ్యి కూడా అక్కడ కూడా ఎక్కువ రోజులే ఆడింది.
సింహా:
బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమా 2010లో వచ్చింది. ఈ సినిమా విశాఖ నగరంలోని గోపాలపట్నం మౌర్య డీలక్స్‌లో 210 రోజుల పాటు 4 ఆటలతో డైరెక్టుగా ఆడింది. నయనతార, స్నేహ ఉల్లాల్ హీరోయిన్లుగా నటించిన సింహా సూపర్ హిట్ అయ్యింది.
లెజెండ్:
బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన మరో సూపర్ హిట్.. రెండో సినిమా లెజెండ్. 21014 సాధారణ ఎన్నికలకు ముందు రిలీజ్ అయిన లెజెండ్ ఆ ఎన్నికల్లో టీడీపీకి కేడర్‌కు మాంచి జోష్ ఇచ్చింది. కర్నూలు జిల్లా, కడప జిల్లాలో 2 కేంద్రాల్లో ఈ సినిమా 200 రోజులు ఆడింది. అయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మినీ శివలో లెజెండ్ ఏకంగా 421 రోజుల పాటు ఆడింది. తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులకు ఈ సినిమా పాతరేసి.. ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కేసింది.