కోలీవుడ్ లవ్ లీ కపుల్ ఎవరంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందరు టకున్న చెప్పే పేరు నయనతార-విఘ్నేశ్ శివన్. కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్న ఈ జంట ఇదిగో పెళ్లి చేసుకుంటాం అదిగో పెళ్లి చేసుకుంటాం అంటూ కాలం సాగదీస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రేజీ కపుల్ పెళ్లి కాకుండానే ఒక్కే ఇంట్లో ఉంటున్నారన్న వార్తలు వైరల్ గా మారాయి.
మరికొద్ది రోజుల్లో నయన్- విగ్నేష్ శివన్ జోడీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుండగా.. ఆ ఇద్దరూ కలిసి పెళ్లి ముందే తీసుకుంటున్న కొన్ని డిసీజన్స్ చర్చల్లో నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు నిశ్చితార్థం నే చేసుకున్న ఈ జంట చెన్నై పోయస్ గార్డెన్లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసి వాళ్ళకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకోవడానికి కోట్లు ఖర్చ్చేస్తున్నారు అన్న వారత మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇంతలోనే మరో షాకింగ్ వార్త బయటకొచ్చింది.
త్వరలోనే వివాహ బంధంతో ఒకటి కాబోతున్న ఈ జంట.. ముందు చూపుతో దుబాయ్‌కి చెందిన ఆయిల్ కంపెనీలో ఏకంగా రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జంట దీనిపై బాగా స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. ఒక్కవేళ ఇదే నిజమైతే ఈ జంట బిజినెస్ పరంగాను బిలీనియర్స్ కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఆయిలు కంపెనీలో పెట్టుబడులంటే మాములు విషయం కాదు. ఫుల్ ప్రాఫిట్స్ ఉన్న వ్యాపారం ఇది. ఇక ఈ కాబోయే జంట ముందు చూపికి సలాం కొడుతున్నారు నెటిజన్స్. కోలీవుడ్‌లో కూడా దీనికి సంబంధించి చరచలు సాగుతున్నాయట. ఏదేమైనా నిర్మాతలుగా సక్సెస్ అయిన ఈ జంట ఇప్పుడు కొత్త బిజినెస్‌లో ఎంటరవబోతుండటం హాట్ టాపిక్‌గా మారింది.