Moviesబాల‌య్య‌తో ఒట్టు వేయించుకున్న భార్య వ‌సుంధ‌ర‌.. షాకింగ్ రీజ‌న్‌..!

బాల‌య్య‌తో ఒట్టు వేయించుకున్న భార్య వ‌సుంధ‌ర‌.. షాకింగ్ రీజ‌న్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. క‌రోనా సెకండ్ వేవ్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పెద్ద సినిమా కావడంతో పాటు బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో అఖండపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను అందుకునే అఖండ కేవలం రెండు రోజుల్లోనే రు. 50 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవర్సీస్లో అయితే ఇప్పటికే అఖండ లాభాల్లోకి వచ్చేసింది. ఇక అఖండలో అఘోర పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు అంటూ ప్రతి ఒక్కరూ ప్రశంసల వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రతి ఒక్కరు కూడా బాలయ్య నామస్మరణ చేస్తున్నారు. థియేటర్లలో అయితే ప్రేక్షకులకు ఊగిపోతున్నాయి. మరోవైపు బాలయ్య హోస్ట్‌గా చేసి ఆహా పోటీలో వస్తున్నా అన్‌స్టాప‌బుల్ షో కూడా అదిరిపోతుంది. తెలుగు బుల్లితెర మీద మిగిలిన అన్ని టాక్ షో లతో పోలిస్తే ఈ షో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. తాజాగా అనిల్ రావిపూడి – బ్ర‌హ్మానందంతో బాలయ్య చేసిన టాక్ షో స్ట్రీమింగ్ అయింది. ఈ షోలో బాలయ్య ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

బాలయ్య తన భార్య వ‌సుంధ‌ర‌ను ఎప్పుడు అయినా సినిమాకు తీసుకు వెళితే సినిమా మధ్యలో సినిమా నచ్చకపోతే వెళ్లిపోవటం… లేదా ఆ సమయంలో నిద్రపోవడం తన భార్య వసుంధరకు నచ్చదని బాలయ్య చెప్పారు. అయితే పాటలు వచ్చినప్పుడు నిద్రపోకుండా ఉండాలని… సినిమా మధ్యలో వెళ్లకూడదని తన భార్య త‌న‌తో వ‌ట్టు వేయించుకున్నాకే సినిమాకు వస్తుందని బాలయ్య చెప్పారు.

ఇక ఈ షో ద్వారానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా తెరకెక్కే సినిమా గురించి బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల‌లో ఎవ‌రు అంటే ఇష్టమని బ్రహ్మానందాన్ని కాస్త ఇరుకున పెట్టే ప్ర‌శ్న వేశారు. ఏఎన్నార్ అంటే ఇష్టమని మీరు అన్నట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని బాలయ్య చెప్పారు. అయితే బ్రహ్మానందం మాత్రం ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ ఇద్దరు తనకు సమానమే అని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news