Moviesనందమూరి తారకరామారావును ఆడవేషం వేయమంటే ఏమన్నారో తెలుసా..?

నందమూరి తారకరామారావును ఆడవేషం వేయమంటే ఏమన్నారో తెలుసా..?

నందమూరి తారకరామారావు..టాలీవుడ్ సినీ చరిత్రలో..అలాగే రాజకీయ చరిత్రలో ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది. ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు ఉండడేమో..? అనడంలో సందేహం లేదు. ముందు కథానాయకుడిగా.. ఆ తర్వాత మహానాయకుడిగా ఆయన జీవితం ఆదర్శప్రాయం. ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్. టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు మరెవరికి లేవు..రావు అనే చెప్పాలి.

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడే కాదు.. ప్రజలు నచ్చిన మెచ్చిన ప్రజానాయకుడు కూడా. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించిన ఈయన ..మనసులో ఏదైనా అనుకుంటే అది సాధించేంతవరకూ నిద్రపోనటువంటి గొప్ప నటుడు. కార్యసాధకుడు. తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

కాగా.. ఎన్.టి.ఆర్, విజయవాడలో చదువుకునే రోజుల్లో అక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి గా ఉండేవారు. రామారావుకి నాటకలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ క్రమంలో చదువుకునే రోజుల్లో ఆయన బాగా నాటకాలు వేసేవారు. ఒకసారి రామారావును ఓ నాటకములో ఆడవేషం వేయాల్సి వచ్చింది.

అప్పుడు రామారావు గారు అస్సలు ఒప్పుకోలేదట. ఆయన ఆడ వేషం వేయడానికి ఎందుకు నిరాకారించారో తెలుసా..?. ఆయన మీసాలు తీయాల్సి వస్తుందని ఆ నాటకములో ఆడ వేషం వేయనని మొండి చేసారట. కానీ ఫైనల్ గా ఆడ వేషం వేసారు కానీ.. రామారావు తన మీసాలు మాత్రం తీయలేదు. మీసాలతోటే ఆ నాటకం లో నటించడం వలన ఆయనకు అప్పట్లో “మీసాల నాగమ్మ” అనే పేరును కూడా పెట్టారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news