Moviesసిరివెన్నెల అంత్యక్రియలకు మంచు ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కారణం ఇదే..!!

సిరివెన్నెల అంత్యక్రియలకు మంచు ఫ్యామిలీ దూరంగా ఉండడానికి కారణం ఇదే..!!

తెలుగుజాతి గ‌ర్వించ‌ద‌గ్గ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి యావ‌త్ తెలుగు జాతిని విషాదంలోకి నెట్టేసింది. 37 ఏళ్ల జీవితంలో సిరివెన్నెల ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సిరివెన్నెల‌గా నిలిచిపోయారు. ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీ కలిచివేస్తోంది. సిరివెన్నెల ఇక లేరు అన్న విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు షాక్‌కు గుర‌వుతున్నారు. కేవలం సినిమా సెల‌బ్రిటీలు.. సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు ఆయన పాట‌ల‌కు ఎన్నో సంవత్సరాలుగా అభిమానులుగా ఉన్న‌ రాజకీయ ప్రముఖుల కూడా విచారం వ్యక్తం చేస్తూ సిరివెన్నెల పాటలను గుర్తు చేస్తున్నారు.

దాదాపు 8000 పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఆయ‌న అంత్య‌క్రియ‌లకు సెలబ్రిటీలు అందరు వచ్చారు. అభిమానుల అశ్రునయనాల మధ్య ఆయన పార్థివదేహనికి పూజ‌లు నిర్వ‌హించి ఆ త‌ర్వాత అంత్యక్రియ‌లు జ‌ర‌పించారు.

ఈ అంతిమయాత్రకు టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, జగపతిబాబు, రాజశేఖర్‌, శ్రీకాంత్‌, పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, రానా, నాని, సుధీర్‌బాబు, నాగబాబు, శర్వానంద్‌, శివబాలాజీ, నరేశ్‌, వరుణ్‌సందేశ్‌, తివిక్రమ్‌, రాజమౌళి, కీరవాణి, ఆర్పీ పట్నాయక్‌, తనికెళ్ల భరణి తదితర సినీ ప్రముఖులంతా సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు.

 

అయితే, టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలలో ఒకటైన మంచు ఫ్యామిలీ నుండి ఎవరూ సీతారామశాస్త్రి అంత్యక్రియలలో కనిపించలేదు. దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

దీంతో ఈ విషయంపై మంచు మోహన్ బాబు స్పందించారు. తాజాగా దీనికి మోహన్ బాబు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపిన మోహన్ బాబు.. ఆయన సిరివెన్నెల అంత్యక్రియలకు రాలేకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేసారు.

తిరుపతిలో నివసిస్తున్నటువంటి మోహన్ బాబు తమ్ముడు కూడా మరణించిన సంగతి మనకు తెలిసిందే. తన తమ్ముడు చనిపోవడం వల్ల తమ కుటుంబసభ్యులు బయటకు వెళ్లకూడదని పంతులు గారు చెప్పడం వల్ల.. ఎవరు కూడా సిరివెన్నెల అంత్యక్రియల్లో పాల్గొనలేదు అని క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు” మోహన్ బాబు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news