Movies"శుభలగ్నం" సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఇదే..!!

“శుభలగ్నం” సినిమా తీయడానికి మెయిన్ రీజన్ ఇదే..!!

“శుభలగ్నం”.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన అది తక్కువగానే కనిపిస్తుంది. జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. జగపతి బాబు అమాయకపు నటన తో మెప్పిస్తే ..అత్యాశలకు పోయి భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన భార్యగా ఆమని పర్ ఫామెన్స్ ఇరగదీసింది. కానీ ఆతర్వాత తన తప్పును తెలుసుకుని డబ్బుకున్న మొగుడే ముఖ్యం అంటూ కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని తమ నట విశ్వరూపం ప్రదర్శించింది.

ఇక రోజా అయితే ఈ సినిమాలో జీవించేసిందనే చెప్పాలి. లంచాలు తీసుకోకుండా ఉన్నది చాలనుకుని సరిపెట్టుకునే మధ్యతరగతి ఉద్యోగి ని ప్రేమించి.. గారాభంగా పెరిగిన అమ్మాయి సాదాసీదా ఇళ్లాలుగా మారితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు రోజా చేసి చూయించింది.

మిడిల్ క్లాస్ భర్తగా వచ్చిన దాంట్లోనే సర్దుకు పోయే జగపతి బాబు, డబ్బే ముఖ్యం అనుకుంటూ అత్యాశలకుపోయి భర్తనే అమ్మేసుకున్న భార్య గా ఆమని.. కోటి రూపాయలకు కొనుక్కున్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకు అండగా ఉండే పాత్రలో రోజా అదరగొట్టేసారు. అప్పట్లో దర్శకులుందరూ మంచి ప్రేమకథలు తీస్తుంటే కృష్ణారెడ్డి మాత్రం విడాకుల గురించి సినిమాలు తీశారు.

అయితే ప్రేమ కథలు, మంచి ఫ్యామిలీ డ్రామాల కంటే ఈ విడాకుల కథలే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సన్సేషనల్ హిట్ గా నిలిచిన కుటుంబ కథా చిత్రం శుభలగ్నం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

కాగా, అసలు ఇలాంటి సినిమా తీయాలని మీకెందుకు అనిపించిందని ఓ ఇంటర్వ్యుల్లో ఎస్వీ కృష్ణారెడ్డి ని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ విని అక్కడున్న వారు షాక్ అయ్యారట. అవసరానికి మించి అత్యధిక డబ్బులు సంపాదించాలనే ఆలోచన వస్తే..ఆ ఆశ విపరీతంగా పెరిగిపోతే.. భార్య భర్తల మధ్య వచ్చే ప్రాబ్లంస్ ఇలానే ఉంటాయి అని చెప్పడానికి ఈ సినిమాను తెరకెక్కించారట.

అత్యాశలకు పోతే భార్యలు భర్తను కూడా విక్రయించడానికి రెడీ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికే శుభలగ్నం సినిమా చేశామని ఆయన అన్నారు. ఉన్నదాంట్లో సర్దుకుంటే అంతా హ్యాపీ..అదే అత్యాశకు పోతే ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికే “శుభలగ్నం” సినిమా తీసాము అంటూ క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news