టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్లో హలో బ్రదర్ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నాగార్జున ఆ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన హలో బ్రదర్ సూపర్ డూపర్ హిట్ అయింది. నాగార్జున – సౌందర్య కలిసి నటించిన తొలి సినిమా హలో బ్రదర్. అంతకు ముందు నాగ్ – ఈవీవీ కాంబోలో వారసుడు సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. ఈవీవీ నాగ్‌కు రెండో సినిమాతో కూడా మంచి హిట్ ఇచ్చాడు.
ఓకే లక్షణాలు ఉండి.. ఏకకాలంలో ఒకేలా ప్రవర్తించే కవలల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున సరసన మరో హీరోయిన్‌గా రమ్యకృష్ణ నటించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాగార్జున సైతం ఈ సినిమా హిట్ అవుతుందని.. నాకు నమ్మకం లేదంటూ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ముందే అనేవారు అట. అయితే సినిమా రిలీజయ్యాక సూపర్ డూపర్ హిట్ అయింది. నాగార్జునకు అదిరిపోయే మాస్ ఇమేజ్ కూడా హలో బ్రదర్‌తో వచ్చింది.
హలో బ్రదర్ సినిమా కు సీనియర్ ఎన్టీఆర్ నటించిన అగ్గి పిడుగు సినిమాకు సంబంధం ఉంది. అగ్గి పిడుగు సినిమాలో ఎన్టీఆర్ సియామి ట్విన్స్‌గా నటించారు. అక్కడ కూడా ఇద్దరు రామారావులు ఉంటారు. ఆ సినిమా కథను ప్రేరణగా తీసుకుని ఈవీవీ సత్యనారాయణ హలో బ్రదర్ తెరకెక్కించారని అంటారు. అగ్గి పిడుగు కథను మూలంగా చేసుకుని.. జాకీచాన్ నటించిన ట్విన్స్ సినిమాలో కొన్ని సీన్లను బేస్ చేసుకునే హలో బ్రదర్ కథ రాసుకున్నట్టు టాక్ ?
ఇక 1964 లో రిలీజ్ అయిన అగ్గిపిడుగు అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. 57 సంవత్సరాల క్రితమే అప్పట్లో తొలి వారం రోజుల్లోనే రు. 5 లక్షల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ సరసన కృష్ణకుమారి – రాజశ్రీ – జయంతి నటించారు.