ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించి వారం రోజులు కావస్తున్న ఇంకా ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు సినిమా ఇండస్ట్రీ కలిచివేస్తోంది. సిరివెన్నెల ఇక లేరు అన్న విషయాని ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కేవలం సినిమా సెలబ్రిటీలు.. సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు ఆయన పాటలకు ఎన్నో సంవత్సరాలుగా అభిమానులుగా ఉన్న రాజకీయ ప్రముఖుల నుంచి ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సహా ఎంతోమంది విచారం వ్యక్తం చేస్తూ సిరివెన్నెల పాటలను గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక చివరిసారిగా నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఓ పాట రాస్శారు. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో భాగంగ ఆ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. శాస్త్రిగారి అంతిమ సంస్కారాలు నిర్వహించిన రోజున సిరివెన్నెల పాట రికార్డ్ చేయబడింది. శ్యామ్ సింగ రాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారికి అంకితం ఇచ్చారు మేకర్స్. తాజాగ సిరివెన్నెల చివరి పాటను విడుదలచేశారు మేకర్స్. ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ పాట వింటుంటే మళ్లీ సిరివెన్నెల పాటలు రావు అనేభావోద్వేగం ఉబుకుతుంది.
‘సిరివెన్నెల’ పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇక శ్యామ్ సింగ రాయ్ సినిమాకు నాని, సాయి పల్లవి మధ్య వచ్చే ప్రేమ కథ అతి పెద్ద బలంగా మారుతుందనిపిస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథను అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట మీరు వినండి…!!