యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాలు ఇవ్వకపోయినా కూడా… బాలయ్యకు మంచి పేరు రావడంతో పాటు ఆయన అభిమానులకు కూడా మంచి జోష్ ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో చెన్నకేశవరెడ్డి సినిమా ఒకటి.
2002లో వచ్చిన ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ టబు, శ్రియ నటించారు. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలతో వచ్చిన చెన్నకేశవ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర ఆ స్థాయి అంచనాలు అందుకోలేక పోయినా హిట్ అయింది. ఆ రోజుల్లోనే 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడటంతో పాటు అందరికీ లాభాలు తెచ్చిపెట్టింది.
అయితే ఈ సినిమా ప్లాప్ అయినా కూడా హీరో బాలకృష్ణకు బాగా నచ్చింది. దర్శకుడు వినాయక్‌తో సైతం సినిమా మన అంచనాలను అందుకోలేదని మీరు ఏం ఫీల్ అవ్వద్దు… మీకు నాతో ఎప్పుడు సినిమా చేయాలని ఉన్నా కూడా మనం సినిమా చేద్దాం అని ఎన్నోసార్లు చెప్పారట. విశేషం ఏమిటంటే ఈ సినిమా అంటే బాలయ్య భార్య వసుంధర కూడా చాలా ఇష్టం.
ఈ సినిమా చూసిన తర్వాత వసుంధర దర్శకుడు వినాయక్‌తో సినిమాలో బాలయ్య చాలా బాగున్నారు.. ఆయన్ను చాలా బాగా చూపించారు… ముఖ్యంగా పెద్ద బాలయ్య పాత్ర మీరు చూపించిన విధానం చాలా చాలా బాగుందని వినాయక్‌పై వసుంధర ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా చేసినన్ని రోజులు బాలయ్య చాలా ఎంజాయ్ చేశారని… చాలా హ్యాపీగా ఉన్నారని… ప్రతిరోజు ఆ సినిమా గురించే ఇంట్లో చెప్పేవారని వసుంధర వినాయక్‌తో అన్నారట.
ప్రతిరోజు షూటింగ్ ముగిశాక ఇంట్లో కూడా ఆ సీన్లు గురించి తనతో ఎక్కువగా చర్చించే వారని వసుంధర చెప్పారట. వసుంధర గారు ఇచ్చిన కాంప్లిమెంట్ తాను ఎప్పటికీ మరిచిపోలేనని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి సినిమాతోనే ఆది లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వినాయక్‌కు చెన్నకేశవరెడ్డి రెండో సినిమా.