Moviesఅఖండ సినిమా పై దిల్ రాజు ఒపీనియన్ ఇదే..!!

అఖండ సినిమా పై దిల్ రాజు ఒపీనియన్ ఇదే..!!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న అఖండ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం య్తెలిసిందే. ఈ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్న అభిమానుల ఆశలను బోయపాటి ఫుల్ ఫిల్ చేసాడు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఇక ఎప్పటి నుండో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అభిమానులు సినిమా భారీ హిట్ అవ్వడంతో దగ్గర బ్యానర్లు కడుతూ..కేక్స్ కట్ చేసి .. ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

థియేటర్స్ ముందు అభిమానుల కోలాహలం మొదలైంది. తెల్లవారు జామునుంచే అభిమానుల హంగామా మొదలైంది. ఇక సినిమా చూసి బయటకు వచ్చిన అభిమానులు ఈ సినిమా గురించి బాలయ్య పర్ ఫామెన్స్ గురించి మీడియా తో చెబ్బుతున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గేస్ట్ హిట్ అంటూ జై బాలయ్య అని మైక్ పట్టుకుని అరుస్తున్నారు.

ఇక బడా ప్రోడ్యూసర్ దిల్ రాజు సైతం ఈ మూవిని ధియేటర్ లో చూసి వచ్చి.. మీడియాతో మాట్లాడారు. “సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందే చెప్పా..అదే జరిగింది. బోమ్మ అదుర్స్..సెకండ్ ఆఫ్ అద్దిరిపోయింది” అంటూ చెప్పుకోచ్చారు. ఓవర్సీస్‍లో బాక్సాఫీస్ వద్ద బాలయ్య అఖండతో రికార్డులు క్రియేట్ చేశాడంటూ అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news