యువరత్న నందమూరి బాలకృష్ణ – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ? ఉంటుందో ఆ రికార్డులు ఎలా ఉంటాయో ? ఊహించుకోవడానికి అందటం లేదు. రాజమౌళి తన కెరీర్లో ఓటమి అన్న పదం తెలియకుండా వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాహుబలి సీరిస్ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ఏకంగా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి ఈ తరం జనరేషన్ హీరోలలో స్టార్ హీరోలుగా ఉన్న ప్రభాస్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రవితేజ లాంటి హీరోలతో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. రాజమౌళి ఇప్పటి వరకు సీనియర్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ – రాజమౌళి రెండుసార్లు సినిమా చేసే ఛాన్స్ వచ్చినా అనివార్య కారణాల వల్ల వీరి కాంబినేషన్ సెట్ కాలేదు.
రాజమౌళి ఎన్టీఆర్ తో తెరకెక్కించిన సింహాద్రి సినిమా కథను ముందుగా బాలయ్య చెప్పారు. అయితే అప్పుడు బాలయ్య పలనాటి బ్రహ్మనాయుడు సినిమాతో బిజీగా ఉండడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. పలనాటి బ్రహ్మానాయుడు సినిమాకు ముందు వరకు బాలయ్య – బి.గోపాల్‌ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. అప్పటికి రాజమౌళి ఒక్క సినిమా మాత్రమే చేశాడు. దీంతో బాలయ్య బ్రహ్మనాయుడు సినిమా చేసేందుకు మొగ్గు చూపడంతో సింహాద్రి కథపై ఆసక్తి చూపలేదు.
ఆ తర్వాత మగధీర సినిమా కథను కూడా ముందుగా రాజమౌళి బాలయ్యకే చెప్పారట. ఈ విషయాన్ని బాలయ్య అన్‌స్టాపబుల్ షో లో రాజమౌళి బయటపెట్టారు. అనివార్య కారణాలతో ఆ సినిమా కూడా చివరకు రామ్చరణ్ చేయాల్సి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా రు. 50 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా మగధీర రికార్డులకు ఎక్కింది. అలా బాలయ్య – రాజమౌళి కాంబినేషన్లో రావల్సిన ఈ రెండు సినిమాలు మిస్ అయ్యాయి. భవిష్యత్తులో అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందేమో ? చూడాలి.