అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ మూవీ థియేటర్స్‌లో సత్తా చాటుతోంది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటూ దుమ్మురేపుతుంది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ రాను రాను పుంజుకొని అల్లు అర్జున్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచింది. మొదటి రోజు నుంచి కలక్షన్ల సునామీ కురిపిస్తున్న పుష్ప ఇప్పటికూడా కూడా అదే జోరు కొనసాగిస్తుంది. ఇక కలెక్షన్స్ పరంగా చూస్తే అన్ని ఏరియాల్లోనూ వసూళ్ల ప్రవాహం కనిపిస్తుండటం విశేషం.
కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత థియేటర్లలో ఆడియన్స్ చేత ఈలలు వేయించి సినిమాకి పూర్వ వైభవం తీసుకురావడంలో తనవంతు చేయి వేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ‘పుష్ప’ మూవీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నమోదు చేస్తున్న పుష్ప వసూళ్లు బన్నీ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ముఖ్యంగా పుష్పరాజ్‌గా బన్నీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తెలుగు, తమిళం సహా హిందీలోనూ మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది ఈ చిత్రం.
ఇక పుష్ప ఇంతటి ఘన విజయం సాధించడంతో టీ ఫుల్ హ్యాపీగా ఉంది. కస్కెస్ మీట్ లతో తమ ఆనందాని అభిమానులతో పంచుకుంటుంది. ఇది ఇలా ఉందగా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. నిజానికి సుకుమార్ ఈ సినిమా క్లైమాక్స్ ని వేరేలా రాసుకున్నాడట. ఇక ఆ క్లైమాక్స్ సీన్లలలో ముందుగా కొన్ని న్యూడ్ సీన్స్ తీయాలి అనుకున్నారట.
క్లైమాక్స్ సన్నివేశాలను చాలా పచ్చిగా రాసుకున్నట్లు.. ఫాహాద్ ఫజిల్ ను హీరో అల్లుఅర్జున్ ని ఇద్దరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్ గా ఉండాలి అని అనుకున్నారట. కానీ, అలాంటి సీన్స్ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కావు అని భావించి చివరి నిమిషంలో వాళ్లను అండర్ వేర్లో కనిపించేలా కధను మార్చుకున్నాడట. కాగా ఫిబ్రవరిలో ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.